Godavari Anji Reddy: ఉత్తర తెలంగాణలో కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.. ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం దూసుకుపోతున్నారు.. ఇక, నేను మీ అంజిరెడ్డి.. గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను చేసినా సేవాకార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే అంటున్నారు బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన.. నేను ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వాసిగా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు..
ఇక, న్యాయవాదులకు రక్షణ అనేది లేకుండా పోతుంది. సంగారెడ్డి బార్ అసోసియేషన్ లో 600 మందికి పైగా వున్నారు.. వారి పక్షాన నిలబడతా.. మండలిలో న్యాయవాదుల రక్షణ కొరకు నేను పొరడతను అని న్యాయవాదులకు హామీ ఇచ్చారు అంజిరెడ్డి.. టీచర్స్ ఎమ్మెల్సీ లాగే న్యాయవాదులకు ఒక ఎమ్మెల్సీ వుండాలని మీరు కోరడం జరిగింది. రాష్ట్రంలో టీచర్స్ ఎంతమంది ఉన్నారో న్యాయవాదుల అంతే వున్నారు.. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి న్యాయవాదుల ఎమ్మెల్సీ కూడా వుండాలనే ప్రతిపాదన నేను తీసుకుని పోతానని భరోసా ఇచ్చారు.. న్యాయవాదులకు శాశ్వత నివాసం లేకుండా న్యాయంకోసం పోరాడుతున్న వారికి నివాసం కోసం నేను మండలిలో పోరాడతానని అన్నారు.. సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ లో ఉన్నప్పట్టి నుంచి కొత్తగా చేరే న్యాయవాదులకు వారి సౌకర్యార్థం 6 నెలల వరకు వారికి నేనే 5000 రూపాయల స్టైపెండ్ ఇస్తాను.. ఇక న్యాయవాదుల భీమా విషయంలో కూడా ప్రస్తుతం 2 లక్షల భీమా సౌకర్యాన్ని 20 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తా. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన మరియు జీవన్ జ్యోతి భీమా యోజన అలాగే.. ఎస్బీఐ కల్పించే 20 లక్షల భీమా కూడా వచ్చేలా కృషి చేస్తా.. మొదటి ప్రీమియం కూడా నేనే కట్టి.. మీ అందరికీ భీమా వుండేలా కృషి చేస్తాను అన్నారు గోదావరి అంజిరెడ్డి.