Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఈగల్ టీం కీలక ప్రకటన..
- ఫామ్ హౌస్‌పై దాడి సమయంలో కాల్పులు
- 11 మంది పట్టుబాటు.. ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్
- డ్రగ్ నెట్‌వర్క్‌పై ఈగల్ టీం దర్యాప్తు
- రాజకీయ ప్రముఖుల పేర్లు వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగిన సంచలన డ్రగ్స్ పార్టీ , కాల్పుల ఘటనపై దర్యాప్తు సంస్థ ‘ఈగల్ టీమ్’ కీలక వివరాలను వెల్లడించింది. నిన్న రాత్రి పక్కా సమాచారంతో ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టిన సమయంలో నిందితులు పోలీసులనే ఎదురించే ప్రయత్నం చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈగల్ టీమ్ వెల్లడించిన కథనం ప్రకారం, పోలీసులు ఫామ్ హౌస్‌ను ముట్టడించిన సమయంలో లోపలి నుంచి పోలీసుల వైపు కాల్పులు జరిగాయి. ఈ గగుర్పునొడిచే పరిణామాల మధ్య ఏమాత్రం వెనక్కి తగ్గని పోలీసులు, వెంటనే లోపలికి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాలిలోకి కాల్పులు జరిపి హంగామా సృష్టించిన నమిత్ శర్మ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించి వెంటనే అరెస్టు చేశారు.
IPL 2026: కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ అతనే.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న షారుక్ ఖాన్ టీమ్!
Also Read
- Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
ఈ సోదాల సమయంలో ఫామ్ హౌస్‌లో ఒక మహిళతో సహా మొత్తం 11 మంది మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో అనుమానాస్పద నార్కోటిక్ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరైన శరత్ కుమార్ వద్ద 0.26 గ్రాముల కొకైన్ లభించగా, ఈ డ్రగ్స్‌ను తాను కౌశిక్ రవి ద్వారా తెప్పించుకున్నట్లు అతను నేరాన్ని అంగీకరించడంతో ఈ డ్రగ్ నెట్‌వర్క్ గుట్టు వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో ఐదుగురికి డ్రగ్స్ సేవించినట్లు (పాజిటివ్) నిర్ధారణ కావడం గమనార్హం.
ఈ కేసులో ఈగల్ టీమ్ పేర్కొన్న నిందితుల జాబితాలో రాజకీయ ప్రముఖులు , వీఐపీలు ఉండటం సంచలనంగా మారింది. నిందితులుగా పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నల్లపనేని విజయకృష్ణ , శ్రవణ్ కుమార్‌లను పోలీసులు గుర్తించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఇలాంటి కేసుల్లో పట్టుబడటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుతం నిందితులపై నార్కోటిక్ చట్టంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించి కాల్పులు జరిపినందుకు గాను ఆయుధ చట్టం (Arms Act) కింద కూడా కేసులు నమోదు చేసి తదుపరి విచారణను వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?