ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్లైన్ న్యూస్ మీడియా (వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్కు తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్ విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుపుతూ వారు లేఖ అందించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఐ అండ్ పీఆర్ కమిషనర్ త్వరలోనే ఆన్లైన్…
Non Veg : మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్బంగా రేపు (జనవరి 30) హైదరాబాద్ నగరంలో అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని మేక, గొర్రెల మండిలు, మాంసం దుకాణాలను మూసివేయాలని పేర్కొన్నాయి. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరించారు. మాంసం దుకాణాలు…
CM Revanth Reddy : రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయిన సమగ్ర కుల గణన పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే పై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. బుధవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రులు…
Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుండగా, మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంది? అని లేఖలో బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే… నేటి వరకు 65 లక్షల మంది…
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణన సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కులగణన ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం అన్నారు.
MLC Elections In TG: తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది.
ఫేస్ బుక్ బ్రౌజింగ్ లో వాట్సప్ గ్రూప్ ద్వారా నిందితులు ఆకర్షిస్తున్నారు.. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి రూ. 93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ చేశారు అని ఆయన తెలిపారు. మరో బాధితుడు విడతల వారికి రూ. 2.06 డబ్బును కోల్పోయాడు. అనీషా యాప్ ద్వారా వాట్సప్ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు.. మ్యూల్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకు అధికారుల సహకారంతో ఫ్రాడ్ చేస్తున్నారు అని సీపీ ఆనంద్ చెప్పుకొచ్చారు.
Vasi Zakariya: పాకిస్థాన్ దేశంలోని ఖలీఫా సంస్థ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వరంగల్ వాసి జకర్యను పోలీసులు మద్రాసు ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుండి భారత్కు వచ్చిన జకర్య తొలుత ఎనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జీవనం కొనసాగించాడు. అనంతరం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని జాన్పీరీలు ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. వరంగల్ జిల్లాలో స్థిరపడిన జకర్య, అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఒక బిర్యానీ సెంటర్ను నిర్వహిస్తూ జీవనం…