SLBC Tragedy: తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. కొన్నిరోజుల క్రితం ఈ టన్నెల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. 8 మంది లోపల చిక్కుకుపోయారు. ఈ సంఘటన జరిగి ఎనిమిదో రోజుకు చేరుకుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో రెస్క్యూ పూర్తవ్వలేదు. పనులు పూర్తి చేసేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం మట్టి తొలగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అధికారులు కార్మికుల ఆనవాళ్లను గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలు జీపీఆర్ (GPR), అక్వా ఐ లను ఉపయోగిస్తున్నారు. రెస్క్యూ బృందాలు మృతదేహాలను వెలికితీసే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
Read Also: Shivling: ‘‘కల’’ కారణంగా శివలింగం దొంగతనం చేసిన ఫ్యామిలీ.. వీడిన ద్వారక మిస్టరీ..
SLBC టన్నెల్ వద్ద పూర్తి ఆంక్షలు విధించారు. అవాంఛిత వ్యక్తులు లోపలికి వెళ్లకుండా పోలీస్ భద్రత పెంచారు. రెస్క్యూ బృందాలకు అంతరాయం కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఘటన స్థలానికి ఉస్మానియా వైద్య బృందం చేరుకుంది. మృతదేహాలను వెలికితీసిన వెంటనే తగిన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్థివ దేహాలను తరలించేందుకు అంబులెన్స్ లను సిద్ధం చేశారు.
ఈ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. ప్రభుత్వం, రెస్క్యూ బృందాలు, వైద్య నిపుణులు రంగంలోకి దిగి నిరంతరం సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.