బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా నేను మోనంగా, గంభీరంగా చూస్తున్నా.. నేను కొడితే మాములుగా ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నల్గొండలో అనధికారికంగా కొందరు పంచాయతీ సెక్రటరీలు విధులకు డుమ్మా కొట్టి.. గత రెండు రోజులుగా క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, నాలుగు రోజులుగా 60 మందికి పైగా పంచాయతీ సెక్రటరీలు విధులకు గైర్హాజరు అయ్యారు. హాలియాలోని ప్రైవేట్ బీఈడీ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు.
Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ను సాకుగా చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. పైగా రానున్న ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి వాటిపై ప్రభావం పడే అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ…
Osmania Hospital: హైదరాబాద్ మహా నగరంలోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు.
Harish Rao: బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో.. ఇప్పుడు ప్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
Hyderabad: ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి శారీరకంగా వాడుకుని పెళ్లికి నిరాకరించిన యువకుడుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదు అయింది.
Constable Suicide: షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అంబర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ.వెంకటేష్ అంబర్ పేట్ లోని దుర్గా నగర్లో గల తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రోడ్ సేఫ్టీపై అవగాహన చాలా అవసరం.. ఈ అవగాహన వల్ల మనం అందరం ఒక్కొక్కరం ఒక్కరిని కాపాడినా చాలా సంతోషం అన్నారు. జనవరి ఒకటిన ప్రారంభించాం.. గతంలో వారోత్సవాలను మాసోత్సవాలు చేశారు.. బ్లాక్ స్పాట్స్ ఉన్న వాటిని గుర్తించి వాటిని పూడ్చే ప్రయత్నం మొదలైంది.