Telangana Jagruthi: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్ర సర్కార్ చేస్తున్న అసత్య ప్రచారాలపై కౌంటర్ ఇవ్వడానికి ఈరోజు (జనవరి 31) సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి వెల్లడించింది.
CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు (జనవరి 31) ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11.54 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు.
తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా నూతన ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్ గంజ్‌లో ఉండగా.. నూతన ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. నూతన ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేయనున్నారు.…
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్‌కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లామని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయని, తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకి మంత్రి ధన్యవాదాలు చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా ఇటీవల సీఎం…
తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగుల వ్యవహారం బయటపడింది. నకిలీ ఉద్యోగుల కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పూర్తి ఆధారాలు సేకరించి.. చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజు ఎస్పీఎఫ్కు నకిలీ ఉద్యోగులు పట్టుబడ్డారు. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి…
వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ‘ఉస్మానియా ఆసుపత్రి’ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. కోట్ల మంది ప్రజల కోసం 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్ బిల్డింగ్స్ నిర్మాణం కాబోతోంది. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు.. రెండు ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ.. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ.. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు.. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు.. ఇలా ఇంకా ఎన్నో అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కొత్త…
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల మొబైల్‌లకే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు రానున్నాయి. విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు ఇంటర్ బోర్డు అధికారులు లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే హాల్‌టికెట్ వస్తుందని, డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. గతంలో కళాశాలలకే హాల్‌టికెట్లను పంపేవారు. విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి హాల్‌టికెట్లను తీసుకునేవారు. నేటి (జనవరి 30) నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు జరగనున్నాయి.…