Chakwadi Nala Break: హైదరాబాద్ మహా నగరంలోని గోషామహాల్ పరిధిలోని చాక్వాడి వద్ద మరోసారి నాలా రోడ్డు కుంగిపోయింది. ఈ నాలా ఇప్పటికే నాలుగు సార్లు కుంగిపోగా.. మంగళవారం రాత్రి మరోసారి కుంగింది.
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఎన్నుకున్నారు. సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహా సభల్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు.
మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ నల్లగొండలో రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించాడని విమర్శించారు.
దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వివరాలను సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం.. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై నమ్మకంతో వ్యాపారులు ముందుకు వచ్చారని శ్రీధర్ బాబు తెలిపారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నాడు.. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు పిచ్చి ప్రవీణ్ అని దుయ్యబట్టారు.
Prakash Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పద్మ అవార్డులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయని ఆయన ఆరోపించారు. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పద్మ అవార్డుల ప్రకటన ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి పద్మ అవార్డులకు…
టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి లోపు లక్ష కెమెరాలు ఏర్పాటు.. టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ప్రతి జిల్లాలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నాం అన్నారు.. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం రావటం జరిగింది. మొదటి ప్రయారిటీ గంజాయిని అరికట్టాం.. ఏజెన్సీలో ఎక్కువ గంజాయి ఉండటంతో…
గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఎల్టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో గద్దర్‌ను పోల్చారు విష్ణువర్ధన్ రెడ్డి.. గద్దర్ కి పద్మ పురస్కారం ఇవ్వాలని ప్రధానికి సీఎం లేఖరాయడంపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి.. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తి గద్దర్ కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని నిలదీశారు.
Ramagundam: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నేడు రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్-2 కోసం ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో ఎన్టీపీసీ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణను ప్రశాంతంగా కొనసాగించేందుకు భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి, ముఖ్యంగా స్థలాల కోసం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అయితే, స్థానిక భూ నిర్వాసితులు, ప్రజాప్రతినిధులు ప్లాంటు ఏర్పాటుతో…
HYDRA: హైదరాబాదులోని అమీన్ పూర్లో మరోసారి హైడ్రా అధికారుల కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. ఈ కూల్చివేతలు అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జరుగుతున్నాయి. పలు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు, చెరువును ఆక్రమించుకొని నిర్మాణాలు చేయడాన్ని గుర్తించారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలిన వెంటనే, హైడ్రా కమిషనర్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కూల్చివేతలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. హైడ్రా అధికారులు ఈ కూల్చివేతల సమయంలో ప్రజల…