* నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు..
* నేడు కర్నూలు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన.. మంత్రాలయం రాఘవేంద్రస్వామికి ప్రత్యేక పూజలు..
* నేడు అనంతపురంలో పోలీస్ శిక్ష కళాశాల ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న హోంమంత్రి అనిత..
* నేడు కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జనసేన ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం.. సాయంత్రం 4గంటలకు జనసేన ఆవిర్భావ సభ పనులు ప్రారంభించనున్న మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్..
* నేడు వైసీపీ నేతల ముఖ్య మీడియా సమావేశాలు.. ఉదయం 10 గంటలకు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం.. 12 గంటలకు మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్.
* నేటి నుంచి ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు.. ఉదయం 8.30 నుంచి పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులకు అనుమతి.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష.. ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి నిరాకరణ..
* నేటితో శ్రీశైలంలో ముగియనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం శ్రీస్వామి అమ్మవారికి అశ్వవాహనంపై ప్రత్యేక పూజలు.. అశ్వవాహనంపై ఆది దంపతులకు ఆలయ ప్రకారోత్సవం..
* నేటి నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఈనెల 7న శ్రీ స్వామివారి ఎదుర్కొల్లు, 8న కళ్యాణ మహోత్సవం, 9వ తేదీన దివ్య విమాన రథోత్సవం..
* నేటి నుంచి ప్రారంభం కానున్న మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి గురుభక్తి ఉత్సవాలు.. ఈరోజు రాఘవేంద్రస్వామి 404వ పట్టాభిషేకోత్సవం.. స్వామివారి బంగారు పాదుకలను నవరత్న స్వర్ణ రథంపై ఉంచి ప్రాకారం చుట్టూ ఉరేగింపు..
* నేటి నుంచి ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానా.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ.5 వేలు.. వెహికిల్ కి ఇన్సూరెన్స్ లేకపోతే రూ. 2వేలు.. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే రూ.1000 జరిమానా..
* నేడు డబ్ల్యూపీఎల్ లో బెంగళూరు వర్సెస్ ఢిల్లీ మధ్య పోరు.. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్..