ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు దుర్మరణం పాలైన విషయం విదితమే. అయితే టన్నెల్‌లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరింది. ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీని గుర్తించేందుకు నిపుణులు, సిబ్బంది ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపరితలం పైనుంచి NRSA GST నిపుణులు స్కానింగ్ నిర్వహించారు. భూమి పొరల అమరికపై పరిశీలన చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారు ఉండవచ్చన్న అనుమానిత ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపట్టారు. ఆక్వా ఐసోనార్ టెక్నాలజీ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్‌తో టన్నెల్ లో చిక్కుకున్న వారి ఆచూకీ కనుగొనేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
14 Days Girlfriend Intlo: హీరోయిన్ గా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ.. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే?
గత వారం రోజులుగా టన్నెల్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు సహాయక బృందాలు శ్రమించాయి. చివరకు 13.85 కి.మీ ఉన్న సొరంగంలో 13.61 కి.మీ సహాయక బృందాలు దాటాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో బురద, మట్టి పేరుకుపోయి ఉన్నట్లు సహాయక బృందాలు గుర్తించాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతి కుమారి, ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ టన్నెల్ లో సహాయక చర్యలను పరిశీలించారు.
Posani Krishna Murali : పోసాని ఛాతి నొప్పి డ్రామా.. తిరిగి రాజంపేట సబ్ జైలుకు?
మరోవైపు.. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్‌తో గుర్తించిన ప్రాంతంలో రెస్క్యూ టీమ్స్ తవ్వకాలు జరుపుతున్నారు. GPR ద్వారా రెండు మీటర్ల లోతులో 4 మృతదేహాలను గుర్తించారు. మరోచోట 7 మీటర్ల లోతులో మరో 4 మృతదేహాలు గుర్తించారు. 7 మీటర్ల లోతులో ఉన్న 4 మృతదేహాలు వెలికితీయడం సాధ్యం కాకపోవచ్చని రెస్క్యూ టీమ్స్ తెలిపాయి. రేపు మధ్యాహ్నం వరకు రెండు మీటర్ల లోతులో ఉన్న మృతదేహాలు వెలికితీస్తామని అంటున్నారు. ఇదే విషయం పై మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా క్లారిటీ ఇచ్చారు. మరో 24 నుంచి 30 గంటల్లో 4 మృతదేహాలు వెలికితీస్తామని మంత్రి జూపల్లి వెల్లడించారు. టన్నెల్ లో మనుషులు ఉన్నట్టు ఆనవాళ్లు కనిపించిన ప్రదేశంలో తవ్వకాలు జరుపుతున్నట్లు వివరించారు. 5 నుంచి 8 మీటర్ల మట్టిదిబ్బ కింద నలుగురు వ్యక్తుల ఆనవాళ్లు ఉన్నట్లు స్కానింగ్ లో కనిపించాయని మంత్రి జూపల్లి తెలిపారు. మరో నలుగురు సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ కింద ఉన్నట్లు తెలుస్తోందన్నారు. సహాయక చర్యల్లో మొత్తం 12 విభాగాలు పని చేస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.