KTR: బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైనా వేటు పడుతుందన్నారు.
V. Srinivas Goud: తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన నివేదిక తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది అని ఆరోపించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు.. ఎన్నికల కోసం తప్పుడు నివేదికలను ప్రకటించారు..
పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా అనేక నిధులు కేటాయించారు.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్రానికి ఎన్నో విజ్ఞాప్తులు చేశాం.. కానీ పట్టించుకోవడం లేదు.. తెలంగాణ ఇంతకీ భారతదేశంలో లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పన్నులు కడుతుంటే.. రాష్ట్రానికి మోడీ సర్కార్ మాత్రం మొండి చేయి చూపిస్తుందని కడియం శ్రీహరి అన్నారు.
Tummala Nageswara Rao :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘వర్కర్ టూ ఓనర్’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హైదరాబాద్‌లో సమావేశమై పథకం అమలుపై చర్చించారు. ఈ పథకం ద్వారా గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్‌ను ఏర్పాటు చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నారు.…
Duddilla Sridhar Babu : నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణాకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్ డి ఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయన్నారు. కేంద్ర జిడిపిలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉన్నా ఆమేరకు నిధులు విదల్చలేదని, కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి హక్కు ప్రకారం రావలసిన నిధులు కూడా రాలేదన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. రాష్ట్రం నుంచి పన్నులు రూపంలో రూ.26 వేల…
అటు సంప్రదాయాన్నీ, ఇటు ఆధునిక జీవనశైలినీ మేళవించి, అన్ని తరాల అభిరుచులనూ ప్రతిబింబించే సరికొత్త వస్త్ర జగత్తు – సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ 39వ షోరూమ్‌ను క్లాక్‌టవర్ సెంటర్, మహబూబ్‌నగర్‌లో 2025 ఫిబ్రవరి 1న వస్త్రప్రియుల కోసం ఆవిష్కరించింది! శ్రీ యెన్నం శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్ శాసనసభ సభ్యులు; శ్రీ లక్ష్మణ్ యాదవ్, ఛైర్మన్, మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ; శ్రీ ఆనంద్‌గౌడ్, మునిసిపల్ ఛైర్మన్, మహబూబ్‌నగర్; శ్రీ షబ్బీర్ అహ్మద్, మునిసిపల్ వైస్‌ఛైర్మన్, మహబూబ్‌నగర్; శ్రీ లక్ష్మణ్,…
Bandi Sanjay : కేంద్ర బడ్జెట్ అద్బుతంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ ఇది అని ఆయన అన్నారు. మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఓ వరమని, ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక చర్య అని ఆయన పేర్కొన్నారు. గత 75 ఏళ్లలో మధ్య తరగతి ప్రజల కోసం ఇంత అనుకూలమైన బడ్జెట్…
Budget 2025: కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై హైదరాబాద్ నగరం భారీగా ఆశలు పెట్టుకుంది. మౌలిక వసతులు, ఇతర రంగాలకు ప్రాధాన్యం ఉంటుందని, నిధుల కేటాయింపులు ఉంటాయని మహా నగర ప్రజలు వేచి చూస్తున్నారు.