మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ టార్గెట్గా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ ప్రచారం జరుగుతోంది. అందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా... ప్రచారం మాత్రం కచ్చితంగా ఆయనకు బీజేపీ పరంగా వచ్చే అవకాశాల్ని దెబ్బ తీస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో.. సోషల్ మీడియా వేదికగా ఈటలను కేంద్ర బిందువుగా చేసుకుని జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందా? లేక ఎవరైనా కావాలని టార్గెట్ చేస్తున్నారా అన్న ఆరాలు పెరిగిపోతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో.
TG EAPCET 2025: తెలంగాణ రాష్ట్రంలో పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంజినీరింగ్/ అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్తో పాటు పీజీ ఈసెట్, టీజీ ఐసెట్లకు ఉన్నత విద్యామండలి వేర్వేరుగా షెడ్యూల్ ఖరారు చేసింది.
రైల్వే బడ్జెట్.. ఏపీకి భారీగా పెరిగిన నిధుల కేటాయింపు.. ఈ బడ్జెట్ లో ఏపీకి రూ. 9,417 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయింపులు జరిగాయని తెలిపారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్.. ఈ బడ్జెట్ లో యూపీఏ హయాంలో కంటే ఏపీకి 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు.. ఏపీలో మొత్తం అమలవుతోన్న రైల్వే ప్రాజెక్టులు రూ. 84,559 కోట్ల వరకు కేటాయించామన్నారు.. కొత్త ప్రాజెక్టులు ఓ పద్ధతిలో, శాస్త్రీయమైన రీతిలో కేటాయింపులు జరుగుతున్నాయి. కొత్త…
Aghori Arrested: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లేల చెక్ పోస్ట్ దగ్గర నాగ సాధు అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వరి దేవస్థానంలో ఉన్న దర్గాను కూల్చి వేస్తానంటూ ఇటీవల ఆయన ఛాలెంజ్ చేశారు. ఇందులో భాగంగానే, ఆ దర్గాను కూల్చి వేయడానికి బయలుదేరిన అఘోరిని.. తంగళ్ళపల్లి మండలం జిల్లేల గ్రామ శివారులోని జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకొని తిరిగి వెనక్కి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
రాహుల్ గాంధీ చెప్పినప్పటి నుంచి పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడటం లేదు.. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది.. ఇంపార్టెంట్ అయితే, సీఎం జోక్యం చేసుకుంటారు అని ఆయన వెల్లడించారు. మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్టు ఉంది.. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి.. నేను నిర్ణయం తీసుకునే ప్రోటోకాల్ పరిధిలో లేను.. కేవలం పార్టీ పరిధిలో ఉన్నాను అని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.
కుల సంఘాలను సర్వేలో పాల్గొనాలి అని చెప్పిన పాల్గొనలేదు.. ఈ సర్వేలో కావాలనే కొంత మంది పాల్గొన లేదు అని ఆయన వెల్లడించారు. సర్వేలో ప్రజలు చెప్పిన సమాచారమే నమోదు చేశాం.. ఇక, ఎస్సీ వర్గీకరణపై సాయంత్రం 7గంటలకు మరోసారి సమావేశం అవుతాము.. కుల గణన సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్కు భారతరత్నపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అలియాస్ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. ఇక, ఆయన కుమారుడైన టీడీపీ ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణను ఈ మధ్యే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ వరించింది.. అయితే, ఈ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ.. నాకు పద్మభూషణ్ కాదు.. నాన్న (ఎన్టీఆర్)కు భారతరత్న రావాలని వ్యాఖ్యానించారు.. నాకు పద్మభూషణ్ అవార్డు కంటే..…
SC Classification: ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీకి, ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ మధ్య కీలక భేటీ కొనసాగింది.
KTR: బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైనా వేటు పడుతుందన్నారు.