మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మించాలన్నది ఎప్పటి నుండో చిరకాల కోరిక అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్ పోర్టుకు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవాడిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “స్వాతంత్రం రాకముందే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మామునూరు ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అవ్వడంతో వరంగల్ విమానాశ్రయానికి తాకిడి తగ్గి హైదరాబాద్ కు పెరిగింది.. మోడీకి ముందు 2014 లో దేశంలో 76 ఎయిర్ పోర్టులు ఉందేవి.. మోడీ ప్రధాని అయ్యాక ఈ పడేండ్లలో 159 విమానాశ్రయాలు పెరిగాయి.. ఉడాన్ స్కీమ్ వల్ల చిన్న నగరాలకు కూడా విమానయాన ప్రయాణం విస్తరించింది.. నువ్వు ఏపీకే కాదు.. తెలంగాణకు, యావత్ దేశానికి మంత్రివి అని చంద్రబాబు నాకు పలు సూచనలు చేశారు.. ఏపీ అభివృద్ధితో పాటే తెలంగాణకు కూడా అభివృద్ధి జరగాలని ఆయన చెప్పారు.. మామునూరు ఎయిర్ పోర్ట్ కు సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద 696 ఎకరాల స్థలం ఉంది.. ప్రస్తుత రన్ వే 1600 మీటర్లు ఉంది.. ఎయిర్ బస్ లాంటి విమానాలకు 2800 మీటర్ల రన్ వే అవసరం.. అందుకే ఆలస్యం అయింది.. గతంలో కిషన్ రెడ్డి ఉడాన్ స్కీమ్ లో డెవలప్ చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు..” అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి స్పష్టం చేశారు.
READ MORE: V. Hanumantha Rao: వీహెచ్ తీరుపై ఏఐసీసీ ఆగ్రహం.. స్పందించిన హనుమంతరావు..
రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు స్పష్ట చేశారు. “ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని నిర్మిస్తుంది.. టర్మినల్ బిల్డింగ్ కాకతీయుల చరిత్ర ప్రస్పుటిల్లేలా చేపడుతాం.. కావాల్సిన భూమి సేకరణ చేపట్టాల్సి ఉంది.. మరో ఎయిర్ పోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం వద్ద ఉంది.. అక్కడ కొండలు, జియోగ్రాఫికల్ స్ట్రక్చర్ వల్ల ఫిజిబులిటి లేదన్నారు దీనితో మరో స్థలం చూపించారు.. ఆ స్థలంలో ఫిజిబులిటి చూశారు కానీ కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి.. అన్ని పూర్తయ్యాక వచ్చే నివేదిక ఆధారంగా దానిపై నిర్ణయం తీసుకుంటాం.. విమానాశ్రయం ఏర్పాటు అయితే ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి.. రియల్ ఎస్టేట్, భూమి ధరలు పెరుగుతాయి.. ఎంతో అభివృద్ధి జరుగుతుంది.. ప్రపంచ నలుమూలల నుంచి వరంగల్ కు వస్తుంటారు.. విద్యకు కేంద్రంగా వరంగల్ ఉంది.. టెక్స్ టైల్ పార్క్, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయి.. శంషాబాద్ విమానాశ్రయం చంద్రబాబు విజన్ కు నిదర్శనం.. తెలంగాణ అభివృద్ధి, ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి కిషన్ రెడ్డి వారధిలా ఉన్నారు.. నాకు జన్మనిచ్చిన నేల తెలంగాణ..పార్టీ టీడీపీ.. తెలంగాణలో ఏరో స్పేస్ ఏర్పాటుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది.. దాని వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది.. మామునూరు ఎయిర్ పోర్ట్ కు భూసేకరణ చేపడితే త్వరలో మామునురు నిర్మాణం చేపడుతాం.. ఇప్పటికే అన్ని అనుమతులు వచ్చాయి.. భూసేకరణ అయిపోయాక 3 ఏండ్ల సమయం పడుతుంది..కానీ దీనిపై మా ఫోకస్ ఉంది కాబట్టి రెండున్నర ఏండ్లలో పూర్తి చేస్తాం.. మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి GMR కూడా ఎలాంటి ఆబ్జేక్షన్ చెప్పలేదు.. హైదరాబాద్ లో త్వరలో ఉడాన్ యాత్రి కేఫ్ ఏర్పాటు చేస్తాం..” అని రామ్మోహన్‌నాయుడు మీడియాకు తెలిపారు.