KTR: కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం!
- ఎండిపోయిన వరిపొలాలను పరిశీలించిన కేటీఆర్
- కేసీఆర్ మీద ఉన్న కోపం రైతులను గోస పెడుతున్నారు
- వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లింది
- మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవుని గుట్ట తండాలో ఎండిపోయిన వరిపొలాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్ లో పోస్తే.. దేవుని గుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేశారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. సిరిసిల్ల ప్రాంతంలోని చాలామంది రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం నీళ్లు రాక తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లోనూ వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లింది. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డ పర్రెను రిపేర్ చేసి నీళ్లు ఇవ్వవచ్చు.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
READ MORE: CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
Also Read
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు మండు వేసవిలో ఎర్రటి ఎండల్లో కూడా సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరు ముత్తడి దుంకిందని కేటీఆర్ అన్నారు. “మిడ్ మానేరు అప్పర్ మానేరు నింపడంతో ఎర్రటి ఎండల్లో కూడా వాగులు చెర్లను నింపి రైతులను కాపాడుకున్నాం. సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. చూస్తూ ఊరుకోం. 48 గంటల్లో నీళ్లను వదిలి పెట్టకపోతే మంత్రి ఛాంబర్ ముందట ధర్నా చేస్తా. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. కేసీఆర్ మీద కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కొవాలి. కానీ రైతులను గోస పెట్టొద్దు. ఇప్పటికే 450 మంది రైతులను రేవంత్ రెడ్డి పొట్టన పెట్టుకున్నాడు. కాంగ్రెస్ చెప్పిన రైతు డిక్లరేషన్ లో ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదు. రైతు బంధును కూడా రాలేదు ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే తెలివి లేదు నీళ్లు ఇచ్చే తెలివి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీళ్లేమో పాతాళంలోకి పోయాయి. నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలు ఏమో గాల్లో కలిసిపోయాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులను కాపాడుకోవడానికి వెంటనే నీళ్లను విడుదల చేయాలి. ప్రస్తుతం మిడ్ మానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక్క టీఎంసీ నీళ్లను మల్కపేట రిజర్వాయర్కు వదిలిపెట్టాలని కోరుతున్నాము. తాగునీటి అవసరాలకు మూడు టీఎంసీలు మాత్రమే కావాలి. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాదు ఇంకా 13 టిఎంసిల నీళ్లు మిడ్ మానేరు లో ఉన్నాయి. రైతులకు నీళ్లు విడుదల చేయకపోతే అన్నదాతలతో కలిసి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం. రైతులు గుండె ధైర్యంతో ఉండి వ్యవసాయాన్ని కొనసాగించాలి.” అని మజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
READ MORE: Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్.. ఆకాష్ ఆనంద్ ను అన్ని పదవుల నుంచి తొలగింపు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు