కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానం చేశారు. ఈరోజు చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో ఖుర్షీద్‌కు సీఎం అవార్డును అందించారు. అవార్డు అందుకున్న అనంతరం సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. ఈ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకం అని, తన జీవితంలో దీనికి మించిన అవార్డు…
గాంధీ కుటుంబం దేశంలో శాంతి, సామరస్యతను కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం అని పేర్కొన్నారు. మూడు తరాలుగా దేశం కోసం గాంధీ కుటుంబం పనిచేస్తోందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారిని తిప్పికొట్టాలన్నారు. బీసీ కులగణన చేసి వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపించాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.…
‘మహిళలకు రూ.2500 ఇవ్వండి సీఎం గారు.. అదొక్కటి చేస్తే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లే’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. మహిళలు కూడా అడుగుతున్నారని, జర అదొక్కటి చేయండి అని విజ్ఞప్తి చేశారు. సన్న బియ్యం ఇస్తా అని చెప్పలేదు కానీ ఇస్తున్నామన్నారు. దేశంలో కులగణన చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే అని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కోట్లడదాం అని వీహెచ్ చెప్పుకొచ్చారు. చార్మినార్…
నేడు ఉద్యోగ సంఘతో ప్రభుత్వం కీలక చర్చలు.. దీపావళి ముందు గుడ్‌న్యూస్..! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టింది.. దీపావళికి రెండు రోజుల ముందు గుడ్ న్యూస్ చెప్పాలనుకుందో.. ఏమో.. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మంత్రులతో.. ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.. ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగుల డీఏ.. ఇతర అంశాలు చర్చించారు… ఇవాళ ముగ్గురు మంత్రులు.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు.. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహా మంత్రులు సత్యకుమార్ యాదవ్,…
* నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపు.. బంద్‌కు మద్దతుగా నిలుస్తున్న అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్.. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి.. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో నేడు బీసీ సంఘాలు బంద్‌కి పిలుపు * తెలంగాణలో కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాల…
Off The Record: తెలంగాణ రాజకీయం మొత్తం… ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలకు ఇది చావో రేవో అన్నట్టుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా…సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, అధికార బలం చూపించాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్ అయితే… సిట్టింగ్ సీట్ అనేకాకుండా… ఈ ఉప ఎన్నికలో గెలిస్తే… తిరిగి తమ బలం పెరిగిందన్న సంకేతాలు పంపడంతో పాటు వలసలు, కేడర్‌లో మనోధైర్యం నింపడం లాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని భావిస్తోందట.…
Off The Record : కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్‌లా ముగిసిపోయినట్టేనంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిలిచి మాట్లాడాక ఎపిసోడ్ మొత్తం సెట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఆ విషయంలో సురేఖ… మురళి చేసిన లొల్లి కంటే….. వాళ్ళ కూతురు సుస్మిత చేసిన గొడవే పెద్ద రచ్చకు దారి తీసింది. పైగా ఇది బీసీ వర్సెస్ రెడ్లు టర్న్ అవుతోందన్న సంకేతాలు…
విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించాలని సూచించారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలన్నారు. Also Read:SVSN Varma: మరోసారి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే…
లంచాలు తీసుకునే అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ అధికారిణి రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా జిల్లా అధికారి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ పట్టుబడ్డారు. తమకు అందిన సమాచారం మేరకు…