* నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సుప్రీంకోర్టు అడ్వొకేట్, ఎంపీ అభిషేక్ సింఘ్వీతో భేటీ.. రేపు సుప్రీంలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసు విచారణ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం..
* నేడు మేడారానికి మంత్రులు పొంగులేటి, సీతక్క.. మేడారం జాతర పనులను పరిశీలించనున్న మంత్రులు..
* నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. నదీ జలాల వివాదంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న హరీష్ రావు.. ఉదయం 11 గంటలకి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
* నేటితో ముగియనున్న సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన.. సాయంత్రం 4: 30కి హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు..
* నేడు భోగాపురం ఎయిర్ పోర్టుకు తొలి విమానం.. ఉదయం 11 గంటలకి తొలి విమానం ట్రయల్ రన్.. ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో రానున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు.. ఎంపీ కలిశెట్టి, అధికారులు..
* నేడు రెండో రోజు గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు.. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకానున్న మారిషన్ అధ్యక్షుడు ధర్మ్ గోకుల్..
* నేడు గుంటూరులో వాజ్ పేయి విగ్రహావిష్కరణ.. హాజరుకానున్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, బీజేపీ నేతలు..
* నేటితో ముగియనున్న జోగి బ్రదర్స్ సిట్ కస్టడీ.. ములకలచెరువు కల్తీ మద్యం కేసులో.. విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్ లో సిట్ విచారణ..
* నేటి నుంచి వారణాసిలో జాతీయ వాలీబాల్ టోర్నమెంట్.. టోర్నీని వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. 11వ తేదీ వరకు జరగనున్న వాలీబాల్ టోర్నమెంట్..