కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, ఎంఐఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భాగ్యనగర్ వీధులు కాంగ్రెస్, ఎంఐఎం ఎంతగా దిగజారిన రాజకీయం చేస్తున్నాయో సాక్ష్యం చెబుతున్నాయన్నారు. బీజేపీ & ఎంఐఎం ఒక్కటే అని రాహుల్ గాంధీ ప్రచారం చేసుకుంటూ తిరిగారు – కానీ జూబ్లీహిల్స్లో, ఒవైసీ బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతు ప్రకటిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి ఒక్కసారిగా అభ్యంతరం లేకుండా పోయిందా? ఇది డొల్లతనం కాకపోతే మరేమిటి? అని ప్రశ్నించారు. Also Read:Gujarat Cabinet 2025: గుజరాత్…
దరఖాస్తు గడువు దగ్గరపడుతుండడంతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు మద్యం వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ఈరోజు ఒక్కరోజే 25వేల దరఖాస్తులు నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 45 వేల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ రేపటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. Also Read:Tripura: పశువుల్ని దొంగించేందుకు వచ్చి, చచ్చారు.. బంగ్లాదేశీయుల మృతిపై వివాదం.. అక్టోబర్ 23వ తేదీన కొత్త…
నిన్న(గురువారం) తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో ఇటీవల కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన వివాదాలకు సంబంధించి రాద్దాంతం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తన తల్లిదండ్రుల సాక్షిగా హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీతక్క మాట్లాడుతూ.. నా తల్లి తండ్రులపై ప్రమాణం చేసి చెప్తున్నా.. నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెప్తున్నా..…
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఈరోజు రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి సింగరేణి ప్రస్థానం ప్రారంభమైందని, ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణికే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భట్టి చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. ‘తొలిసారి సైంటిఫిక్గా రాష్ట్రంలో కులగణన…
చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏపీకి విజనరీ నాయకత్వం ఉంది ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి.. ఏపీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఉంది.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తోంది అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అహోబిలం నరసింహస్వామి, మహానందీశ్వరుడికి నమస్కరిస్తున్నా.. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నా.. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన…
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరుగనున్నకేబినెట్ భేటీలో…
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకేమీ తెలియదని ఆమె భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి తెలిపారు. కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి తాను ఒక్కసారే వెళ్లాలని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ ఎంతో కష్టపడ్డామని.. వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్ రేవంతన్న అని పేర్కొన్నారు. సీఎం, తమకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కొండా మురళి స్పష్టం…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీల రిజర్వేషన్ల భవితవ్యం ఆధారపడి ఉన్న నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం ఏ తీర్పు ఇస్తుందోనని అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్న వారు…