DK Aruna: పాలమూరు జిల్లాను కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శించింది. పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లతో ఒకరిపై ఒకరు నేపం నెట్టుకునే ప్రయత్నం తప్ప ఏం లేదు.. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు పాలమూరు ప్రజలకు నష్టం చేసిన వారేనని మండిపడింది. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని ఉన్న మొదటి DPR ప్రకారం తీసుకోవాలని అనేక సార్లు చెప్పడం జరిగింది.. పాలమూరు రైతులతో ఆట ఆడుతున్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించింది.
ఇక, మాయ మాటలతో, మోసం చేసి.. మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులను వాళ్ళపై నెట్టి తప్పించుకోవాలని కాంగ్రెస్ నాటకం ఆడుతుంది. ఇద్దరు ఆడుతున్న నాటకంలో పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. పాలమూరు ప్రజలను పదేళ్లు కేసీఆర్ మోసం చేశారనే.. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారు.. జూరాల అప్రోచ్ అయితేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పుకొచ్చింది. జూరాల నుంచి నీళ్లు తీసుకోవడానికి ఒక అడుగు కూడా ముందుకు పడటం లేదు.. డిండి ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకెళ్లడంతో పాలమూరు ప్రజలకు అన్యాయం జరుగుతుందని బీజేపీ ఎంపీ అరుణ తెలిపింది.
Read Also: Lokayukta court: మాజీ ఎమ్మెల్యే భూ ఆక్రమణ..! లోకాయుక్త కోర్టు సీరియస్
అయితే, పోటీలు పడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.. దాని ఔట్ కమ్ ఏంటి? అని డీకే అరుణ ప్రశ్నించింది. డిండి ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకెళ్ళడాన్ని గతంలో పార్టీలకు అతీతంగా వ్యతిరేకించడం జరిగింది.. జూరాల నీళ్లు తీసుకుని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ DPR టెకాప్ చేయండి అని సూచించింది. ఇంతకు ముందు చేసిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కల్వకుర్తిలో కలపండి లేదా నాగర్ కర్నూల్, నల్గొండ అని దాని పేరు పెట్టండి అని కోరింది. అందులో పాలమూరు- రంగారెడ్డి రెండు లేవు.. పాలమూరు ప్రాంత ఎమ్మెల్యేలు ఎందుకు నోర్లకు ప్లాస్టర్ వేసుకున్నారని అడిగింది. డిండికి నీళ్ళు తీసుకెళ్తుంటే నోర్లు మూసుకొని, చోద్యం చూస్తున్నారంటూ మండిపడింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పై ఎందుకు రివ్యూలు పెట్టడం లేదని డీకే అరుణ క్వశ్చన్ చేసింది.
Read Also: Sandeep Reddy Vanga: నగ్నంగా హీరో… టైటిల్ పోస్టర్ షేర్ చేసిన సందీప్ రెడ్డి వంగా
అలాగే, రివ్యూలకు నన్ను ఆహ్వానించడం లేదు.. కలిసి నిర్ణయం తీసుకుంటే ఏం ఇబ్బంది వచ్చిందని? ఎంపీ అరుణ అడిగింది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పైనా ఇరిగేషన్ నిపుణులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో రివ్యూ పెట్టండి అని సూచించింది. వచ్చే మూడేళ్లలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేలా సీఎం చొరవ తీసుకోవాలని కోరింది.