Half day Schools: తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు శుభ వార్త చెప్పింది. వేసవి కాలం నేపథ్యంలో ఈనెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
15 నిమిషాల అయినా వీడియో రికార్డు స్పీకర్ తెప్పించలేదు.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడకుండా బ్లాక్ చేశారు.. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయకపోతే అవిశ్వాసం పెడతాం అని హరీష్ రావు పేర్కొన్నారు.
Telangana CM: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. దానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో ఇవాళ చర్చిస్తాను.. డీలిమిటేషన్ అనేది సౌత్ ను లిమిటేషన్ చేయడానికే.. డీలిమిటేషన్ పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కచ్చితంగా హాజరు కావాలన్నారు
Congress: తెలంగాణ అసెంబ్లీ మాజీ మత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. బీఆర్ఎస్ అహంకారం ఇంకా తగ్గలేదు.. బీఆర్ఎస్ పార్టీకి దళిత స్పీకర్ పై గౌరవం లేదు అన్నారు. దళిత స్పీకర్ కాబట్టే నువ్వు అంటూ సంభోదిస్తున్నారు.. దళిత స్పీకర్ కాబట్టే ఏకవచంతో పిలుస్తున్నారు అని మండిపడింది.
డీలిమిటేషన్తో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతోంది.. దీనిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించాలి అని డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం.. ఈ నెల 22వ తేదీన స్టాలిన్ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటాం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసహనానికి గురికాకండి అని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇది మంచిది కాదు.. సభను తప్పుదోవ పట్టించడం సరికాదు అన్నారు. నన్ను ప్రశ్నించడమే తప్పు.. నేను ఏం తప్పుదోవ పట్టించానో చెప్పండి అని జగదీష్ రెడ్డి అడిగారు. ఈ సభలో సభ్యులందరికి పెద్దగా స్పీకర్ అక్కడ కూర్చొన్నారు తప్పా స్పీకర్ ది ఈ సభ కాదు.. జగదీష్ రెడ్డి ఏం తప్పు మాట్లాడలేదు.. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని జగదీష్…
Beerla Ilaiah: హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐల్లయ్య అన్నారు. నిన్న గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేశారు.. తెలంగాణ ప్రజానీకం గమైస్తున్నది.. మీరు ప్రజా ప్రతినిధుల లెక్క వ్యవహరిస్తలేరు పందికొక్కుల్లా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు.
Raja Singh: కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. హిందువులతో పెట్టుకుంటే కేసీఆర్ కు ఏమైందో రేవంత్ రెడ్డికి అదే అవుతుంది.. రేవంత్ 9వ నిజామ్ అని మండిపడ్డారు.
KTR: బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ హామీల అమలుకు, గారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయినవారికి పెన్షన్లకు పైసలు లేవా అని ప్రశ్నించారు.