* నేడు, రేపు అరకులో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్.. అడవి తల్లి బాటకు ఏపీ సర్కార్ అంకురార్పణ.. గిరిజన గ్రామాల్లో రెండ్రోజులు పవన్ పర్యటన.. డిప్యూటీ సీఎం పవన్ చొరవతో గిరిజన గ్రామాల్లో పూర్తిస్థాయిలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ముందడుగు..
* నేడు అరకు లోయలో మహా సూర్య వందనం.. 20 వేల మంది గిరి విద్యార్థులతో 108 సార్లు సూర్య నమస్కారాలు.. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్, మంత్రి సంధ్యారాణి..
* నేడు వల్లభనేని వంశీ పిటిషన్లపై తీర్పు.. బెయిల్, పోలీస్ కస్టడీ పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్న జిల్లా కోర్టు.. భూ కబ్జా కేసులో వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారించనున్న కోర్టు..
* నేడు సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ.. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోరిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..
* నేడు తెలంగాణలో నూతన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. ఉదయం 9.15 గంటల నుంచి 11.30 గంటల మధ్యలో ప్రమాణస్వీకారం.. ప్రమాణం చేయించనున్న శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీజేపీ నుంచి మల్కా కొమురయ్య, అంజిరెడ్డి..
* నేడు జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం.. కీలక అంశాలపై చర్చ..
* నేడు భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం.. ఉదయం 10. 30 గంటలకి కన్నుల పండువగా కార్యక్రమం.. హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్న గవర్నర్ దంపతులు..
* నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం.. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన సమావేశం.. కార్పొరేషన్ బడ్జెట్ ఆమోదించే అవకాశం..
* నేడు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభీషేకం..
* నేటి నుంచి వాడపల్లి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు.. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం నిర్వహించేందుకు సన్నాహాలు..
* నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం.. 10 జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు..
* నేడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ.. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్..