తెలంగాణలో మద్యం అమ్మకాల జోరుతో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. గత సంవత్సరంతో పోలిస్తే ఏడు శాతం మద్యం అమ్మకాలు పెరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. 2024-25లో ప్రొహిబిషన్ ఎక్సైజ్ కు 34,600 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కొత్త మద్యం దుకాణాల కోసం ధరఖాస్తుల రూపంలో ఆదాయం రూ. 264.50 కోట్లు వచ్చిందని తెలిపారు. 2024-25 సంవత్సరంలో పన్నుల రూపంలో ఎక్సైజ్ శాఖకు రూ. 7000 కోట్ల సొమ్ము వచ్చిందని వెల్లడించారు.
Also Read:Meerut Murder: మీరట్ మర్డర్ కేసులో ట్విస్ట్.. జైలులో ముస్కాన్ ప్రెగ్నెన్సీ నిర్ధారణ..
2024-25లో సంవత్సరంలో 531 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే బీర్ల అమ్మకాల్లో 3 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపారు. బీర్ల కంపెనీలు 15 రోజుల పాటు సరపరా నిలిపి వేయడంతో తగ్గుదల కనిపించింది. బీర్ల ధరలు పెంచడంతో బీర్ల అమ్మకాలు కొద్దిమేర తగ్గిపోయాయి. 2024-25 అర్థిక సంవత్సరంలో 2 శాతం లిక్కర్ సెల్స్ పెరిగాయి. గతంతో పోలిస్తే ప్రతి సంవత్సరంలాగ తెలంగాణలో మద్యం అమ్మకాల్లో పెరుగుదల కనిపించిందని అధికారులు తెలిపారు.