Engineering College Fee: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఈసారి సీబీఐటీ ఏడాది ఫీజును రూ.2.23 లక్షలుగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఆ కాలేజీలతో పాటు వీఎన్ఆర్, ఎంజీఐటీ తదితర కళాశాలలకు కూడా ట్యూషన్ ఫీజు రూ.2 లక్షలకు చేరుకున్నట్లు సమాచారం.
BRS MLC Pochampally: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో కోడి పందాలు, క్యాసినో కేసులో నోటీసులు అందజేశారు.
Lift Accident: 15 రోజుల వ్యవధిలో మరో పసిప్రాణాన్ని లిఫ్ట్ బలిగొంది. నాంపల్లిలో లిఫ్ట్లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి చనిపోయిన ఘటన మర్చిపోక ముందే.. అలాంటి సంఘటనే మరొకటి మెహదీపట్నంలో జరిగింది.
Off The Record: చిత్తం చెప్పుల మీద- భక్తి భగవంతుడి మీద అన్నట్టుగా ఉంది తెలంగాణలో కొంత మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి. జంప్ అయిన పార్టీలో ఉండలేక, పాత పార్టీలోకి తిరిగి వెళ్ళలేక కుమిలిపోతున్నారట.
Off The Record: వాళ్ళిద్దరూ అధికార పార్టీ లీడర్స్. పైగా గతంలో ముఖ్యమైన పదవులు నిర్వహించినవారే. కానీ... ఇప్పుడు పవరున్న పార్టీలో ఉండి కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అవసరమైతే అధికారులను, పాలకులను నిలదీయండని జనానికి సలహా ఇస్తున్నారు.
Off The Record: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు సక్రమంగా జరగలేదా? ట్రాన్స్ఫర్స్లో గులాబీ ముద్ర కనిపించిందన్నది నిజమేనా? ఎందుకు అలాంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి? అసలు ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్లో ఏం జరిగింది..
Off The Record: కాబోయే ఎమ్మెల్సీ విజయశాంతి అక్కడితో ఆగుతారా? లేక అంతకు మించి అంటారా? ఎలాగూ నాది అధిష్టానం కోటా కదా.. ఇంకో అడుగు ముందుకేస్తే పోయేదేముందని ఆమె అనుకుంటే పరిస్థితి ఏంటి? ఎమ్మెల్సీ దక్కించుకున్న ఊపులో కేబినెట్ బెర్త్ మీద కూడా కర్చీఫ్ వేసే అవకాశం ఉందా? ఆ విషయమై కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?.
Off The Record: అంతా మీరే చేశారు.. ఇదో పాపులర్ సినిమా డైలాగ్. అంతా వాళ్లే చేస్తున్నారు. అన్నీ వాళ్ళకేనా? ఇవి తెలంగాణ కాంగ్రెస్లో పాపులర్ అవుతున్న క్వశ్చన్స్. వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదన్న సామెత ఆ ఉమ్మడి జిల్లా నేతలకు అచ్చుగుద్దినట్లు వర్తిస్తుందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు.