తాను దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రోడ్డు మార్గాన చేరుకున్నారు. మంత్రి సీతక్క, కిషోర్ ప్రినిపల్ సెకరెట్రి, కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా ఘన స్వాగతం పలికారు. ఆదివాసీలు వారి నృత్యాలతో ఆకట్టుకున్నారు. కుమురం భీమ్, బిర్శా ముండా విగ్రహాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధి నిమిత్తం రూ. కోటి 50 లక్షల విలువైన పనులు ప్రారంభించారు.
గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించింది. 783 పోస్ట్ ల భర్తీకి 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్షకు 5 లక్షల 51 వేల 855 మంది దరఖాస్తు చేసుకున్నారు. పలుమార్లు వాయిదా పడి గత డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్ష జరిగింది. 2 లక్షల 51 వేల 738 (45.57 శాతం) మంది పరీక్ష రాశారు. పరీక్షకు…
మొన్న సంగారెడ్డి, నిన్న మెదక్, నేడు సిద్దిపేట జిల్లాలో కోళ్లు మృతి కలకలం సృష్టిస్తోంది. బ్రాయిలర్, లేయర్, నాటుకోళ్లు అనే తేడా లేకుండా వరుసగా కోళ్లు మృతి చెందుతున్నాయి. వర్గల్ (మం) మజీద్ పల్లి గ్రామంలోని పౌల్ట్రీఫామ్ లో రెండ్రోజుల్లో 10 వేల కోళ్ల మృత్యువాత పడ్డాయి. వెటర్నరీ అధికారులు కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపారు. ఏ రోగంతో చనిపోతున్నాయో తెలియక పౌల్ట్రీఫామ్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాకే కోళ్ల మృతిపై…
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి బోటనీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష పేపర్లలో తప్పులు దొర్లాయి. బోటనీ, మ్యాథ్స్ పేపర్లలో చిన్నచిన్న తప్పులు జరిగినట్టుగా గుర్తించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాదన్నపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసైన్డ్ భూమిలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
ఆర్కియాలజీ లైబ్రరీల గురించి అసెంబ్లీలో ప్రశ్నోత్నరాల సమాయంలో చర్చ సాగింది.. రాష్ట్ర విభజన జరిగినప్పుడు.. ఆస్తి, అప్పుల విభజనలో ఏపీకి ఆర్కియాలజీ లైబ్రరీకి సంబంధించి సాంస్కృతిక సంపద పూర్తిగా రాలేదని లేవనెత్తారు జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్.. ప్రభుత్వం వెంటనే ఆర్కియాలజీ శాఖ లైబ్రరీపై దృష్టి పెట్టాలని కోరారు.. ఇక, మండలి బుద్ధ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ.. రాష్ట్ర విభజన తర్వాత 50 శాతం ప్రాచీన పత్రాలు రాష్ట్రానికి…