అప్పు నిప్పుతో సమానం.. నిలువునా కాల్చేస్తది అనడంలో సందేహం లేదు. తీరని అప్పు ఎప్పటికైనా ముప్పే. తీసుకున్న అప్పు తీర్చనందుకు ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాజా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. 6 వేల అప్పు తిరిగివ్వలేదని.. ప్రియుడితో కలిసి మహిళను హత్య చేసింది మరో మహిళ. వికారాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ లో వీడిన హత్య మిస్టరీ… నిందితులను పట్టుకున్న పోలీసులు.. బొంరాస్పేట్ మండలం చౌదర్పల్లికి చెందిన ఈర్లపల్లి యశోద హత్య కేసును పోలీసులు చేధించారు.
Also Read:Fire Break : కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం
పరిగి మండలం రామ్ రెడ్డి పల్లి తండాకు చెందిన అనిత, దోమ మండలం ఉట్పల్లికి చెందిన గోపాల్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనిత, గోపాల్ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అనిత గోపాల్ మధ్య కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. యశోద కొంతకాలం క్రితం అనిత దగ్గర రూ. 6 వేలు అప్పు తీసుకున్నది. యశోదను అప్పు తిరిగి చెల్లించాలని పలుమార్లు అనిత అడిగింది. డబ్బులు ఇవ్వకపోవడంతో యశోద హత్యకు ప్రియుడు గోపాల్ తో కలిసి ప్లాన్ చేసింది. హత్య చేసి యశోద ఒంటిపై ఉన్న బంగారం కాజేయాలని కుట్ర పన్నారు.
Also Read:Khadar Bhasha: టీడీపీ, జనసేన పార్టీలు రెండు నాల్కల ధోరణి విడనాడాలి..
ఈనెల 1న అప్పు విషయం మాట్లాడదామని యశోదకు ఫోన్ చేసి గోపాల్ రప్పించాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించి.. యశోద అకస్మారక స్థితికి వెళ్ళిన తర్వాత ఆమె చీరతో మెడకు చుట్టి హత్య చేశారు. అనంతరం గోపాల్, అనిత మృతురాలి ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నారు. ఆ తర్వాత గోపాల్, అనిత పెద్దేముల్ సమీపంలోని కోటిపల్లి కాలువలో యశోద మృతదేహాన్ని పారేసి.. ముఖంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. రూ. 6 వేలు అప్పు తీర్చనందుకు హత్య చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.