ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారికి గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అవసరమైన ఇంజినీర్లను భర్తీచేసేందుకు చర్యలు చేపట్టింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఏఈ) నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 390 పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఏఈలను ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ నియమించుకోనుంది.
Also Read:Waqf Act: “వక్ఫ్ చట్టాన్ని” వెనక్కి తీసుకునే వరకు దేశవ్యాప్త నిరసన.. ముస్లిం సంస్థ హెచ్చరిక..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు పోటీపడే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 44 ఏళ్లలోపు ఉండాలి. ఈ పోస్టులకు అభ్యర్థులను ఇంజినీరింగ్ లో సాధించిన మార్కులు, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 33,800 జీతం అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.