అది కంపెనీ అయినా... రాజకీయ పార్టీ అయినా... పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం, ఆచరించడమన్నది సహజ లక్షణం. ముందు చెప్పింది చేయడం మొదలుపెడితే... తర్వాత వేసే అడుగుల్లో... నాయకుల దిశా నిర్దేశం ఉంటుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఆ విషయం బోధపడటం లేదట. పదే పదే నాయకత్వం సలహాలు..సూచనలు ఇస్తున్నా... ఆ స్థితి దాటి ఆదేశాల వరకు వెళ్ళినా సరే... కింది నాయకుల తీరు మారడం లేదంటున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మళ్లీ సన్నద్ధం అవుతుంటారు నాయకులు. కానీ... ఆ విషయంలో మర్చిపోయి.. నమ్ముకున్న క్యాడర్‌కు వెన్నుదన్నుగా ఉండాలన్న ప్రాధమిక విషయాన్ని కూడా పట్టించుకోకుండా..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒక రికార్డు అయితే అందులో పని చేసిన ఇంజనీర్లది మరో రకం రికార్డు. ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన బ్యారేజ్‌ల కుంగుబాటుకు నాసిరకం నిర్మాణమే కారణమని కేంద్ర సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించాయి. అలాగే...కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక ఇంజనీర్, గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్‌పై ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
Bhatti Vikramarka : కేంద్ర ప్రభుత్వం కులగణనపై తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయానికి నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని మల్లన్నపాలెం గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిగా కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధిని దృష్టిలో…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్సి హరిరామ్ ఏసీబి కస్టడి కొనసాగుతోంది. ఇప్పటికే హరిరామ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈఎన్సీ హరిరామ్ ను ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. శుక్రవారం హరిరామ్ ను చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబి కస్టడులోకి తీసుకుంది. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హరిరామ్ ఆస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించింది ఏసీబి. బహిరంగ మార్కెట్ వీటి విలువ…