Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మీయ పండుగలలో ఒకటైన బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది తొలి బోనం జూన్ 26న చారిత్రాత్మక గోల్కొండ కోటలో ప్రారంభం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తర్వాత వరుసగా బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు జరగనున్నాయి. బోనాల పండుగను రాష్ట్ర గౌరవానికి మారు పేరుగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 20 కోట్లు కేటాయించింది. పండుగకు ముందు దేవాలయాల అభివృద్ధికి ఇవ్వబోయే చెక్కులను రెవెన్యూ మరియు ఎండోమెంట్స్ శాఖలు సమన్వయం చేసుకొని పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
పండుగ సందర్భంగా జరిగే రంగం, తొట్టెల ఊరేగింపులు కూడా ఈసారి విశేష ఆకర్షణగా ఉండనున్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకొచ్చే బోనాల ఉత్సవాలపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. బోనాల పండుగను ఏ అడ్డంకులు లేకుండా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, శానిటేషన్, రెవెన్యూ, లైటింగ్, వాటర్ ఫెసిలిటీ, కంట్రోల్ రూమ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.
Kingdom : కింగ్ డమ్ వాయిదా తప్పదా..?
పోలీసు శాఖ లా అండ్ ఆర్డర్ పరంగా అప్రమత్తంగా ఉండాలి. అన్ని శాఖలతో సమన్వయం పెంచి పండుగ వేళ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. అధికారులు తమ బాధ్యతను కేవలం ఉద్యోగంగా కాకుండా, భక్తి భావంతో సేవగా భావించి ప్రతి చర్యను శ్రద్ధగా చేయాలని మంత్రి సూచించారు. ప్రత్యేకించి ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ, బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలపై ‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’ సిద్ధం చేయాలని అన్నారు.
అమ్మవారి ఆశీర్వాదంతో బోనాల పండుగ విజయవంతంగా జరిగితే, ఇది హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని తీసుకొస్తుంది అని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. అందరూ బాధ్యతగా తమ పనిని నిర్వహించి, నృత్యాలు, ఊరేగింపులు, సంప్రదాయ వేడుకలతో బోనాలను ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు.
S*exual Assault: లైంగిక వేధింపుల నిందితుడి హతం.. 8 మంది మహిళలు అరెస్టు