Janmabhoomi Express : తెలంగాణలో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. నల్లగొండ రైల్వే స్టేషన్ వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఆ రైలు ఇంజిన్ ఫెయిలవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంజిన్ స్టేషన్ చేరుకున్న తర్వాతే పనిచేయకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణంలో ఆగి ఉంటే విషయం ఇంకా పెద్ద ప్రమాదంగా ఉండేదని అంటున్నారు.
ఘటన జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఉందని గుర్తించి మరొక ఇంజిన్‌ను అక్కడికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ పనులకు కొన్ని గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నల్లగొండ స్టేషన్‌లోనే నిలిచిపోయింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
US: లాస్ ఏంజిల్‌లో ఉధృతం అవుతున్న ఆందోళనలు.. భారీగా బలగాలు మోహరింపు