రాజన్న సిరిసిల్ల: రేపు ఉదయం రోడ్డు మార్గంలో సిరిసిల్ల పర్యటనకు సీఎం కేసీఆర్ రానున్నారు. సిరిసిల్లకు చేరుకున్న అనంతరం… ఉదయం 11.30 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా 15 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు. ఆ తర్వాత 12.20 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు.
read also : మావోయిస్టులు వాడే భాషను రేవంత్ రెడ్డి వాడుతున్నారు !
12.45 గంటలకు సిరిసిల్లలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్న కేసీఆర్… 1.10 గంటలకు సిరిసిల్ల మండలం సర్ధాపూర్ లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత 1.40 గంటలకు ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్(కలెక్టరేట్) భవనాన్ని ప్రారంభించి… అధికారులతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు.