హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుంది. గడచిన 24 గంటల్లో తెలంగాణలో 1,08,954 కరోనా పరీక్షలు నిర్వహించగా, 848 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 98 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇటీవల కాలంలో గ్రేటర్ హైదరాబాదులో ఇదే తక్కువ. 1,114 మంది కరోనా నుంచి కోలుకోగా 6 గురు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,26,085 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,09,947 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,454 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,684కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి నెమ్మదించింది.