ఒక్క ఉపఎన్నిక.. అక్కడి ఉమ్మడి జిల్లాలోని అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోందా? కలెక్టర్ నుంచి సీపీ వరకు ఆకస్మిక బదిలీల వెనక కారణాలు అవేనా? సీనియర్ ఐపీఎస్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఉద్యోగ, రాజకీయవర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! కరీంనగర్ సీపీ బదిలీపై రాజకీయ వర్గాల్లో చర్చ! తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక రాజకీయపార్టీల్లో సెగలు రేపుతుంటే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ అధికారుల కుర్చీలు కదిలిస్తోంది. కలెక్టర్లు.. ఐపీఎస్‌లను ఉన్నపళంగా బదిలీ…
కరోనా కారణంగా సినిమా థియేటర్లు చాలా కాలంగా మూతపడ్డాయి. సినిమా హాల్లో బొమ్మ పడి చాలా రోజులయింది. ఐతే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం.. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ఇప్పటికే కొన్ని సినిమా టయేటర్లు ఓపెన్ అయినా ఇంకా బొమ్మ పడలేదు.. అంతే కాదు సినిమాలు రిలీజ్ చేయడానికి ఏగ్జిబిటర్లు ముందుకు రాలేదు.. దీంతో థియేటర్లు ఎక్కువగా తెరుచుకోలేదు.…
పెద్దనేతలు చేరితే పార్టీ బలోపేతం అవుతుందని సంతోషిస్తారు. కానీ.. ఆ శిబిరంలో రివర్స్. ఒక మాజీ మంత్రి చేరితే.. ఇద్దరు మాజీ మంత్రులు గుడ్‌బై చెప్పేశారు. పార్టీలోనూ అంతర్గత చిచ్చు రగిలిందట. ముఖ్య నాయకుల మధ్యే దూరం పెరిగిందని టాక్. ఆ పార్టీ ఏంటో.. లెట్స్ వాచ్! బీజేపీని వీడిన ఇద్దరు మాజీ మంత్రులు! బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక తర్వాత కాషాయ శిబిరంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆయన కమలం తీర్థం పుచ్చుకునే సమయంలో…
కోమటిరెడ్డి బద్రర్స్‌పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని చూసి సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.. కోమటిరెడ్డి బ్రదర్స్.. ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్న ఆయన.. మీడియా ప్రచారం కోసమే వారి ఆర్భాట౦.. కానీ, ప్రజలకు సేవ చేయాలనే సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారి ధ్యాస డబ్బు సంపాదన పైనే ఉంటుంది.. కానీ, పనులు చేయడంలో ఉండదన్న…
కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.. లేఖల పర్వం నడుస్తూనే ఉంది. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్.. 50 : 50 శాతంలో కృష్ణా నీటివాటా కేటాయించాలని కోరిన ఆయన.. ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని బేసిన్ పరిధి దాటి మళ్లిస్తుందని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపునకు…
ఎన్నికల్లో హామీలు ఇవ్వడం.. విజయం సాధించిన తర్వాత వాటిని అమలు చేస్తూ.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం ఎమ్మెల్యేల పని.. ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధి చేస్తామంటూ నాయకులు చెప్పేవారు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందా? అనే చర్చ మొదలైంది.. దానికి ముఖ్య కారణం హుజురాబాద్ ఉప ఎన్నికలే అంటున్నారు.. తాజాగా, యాదాద్రి భువన గిరి జిల్లా ఆలేరు ప్రజలు.. తమ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు చేసిన విజ్ఞప్తి వైరల్‌గా మారిపోయింది.. గొంగిడి సునీతగారికి ఆలేరు…
తెలంగాణలో వాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. జూన్‌లో పెద్దెత్తున వాక్సినేషన్ జరిగినా, ఒక్కసారిగా ఢీలా పడింది. మొదటి డోస్ వేసుకున్నోళ్లకు రెండో డోస్ ఇప్పుడు దొరకడం లేదు. ఇక ఫస్ట్ డోస్ వేసుకుందామనుకున్నవారికి అదికూడా దక్కడం లేదు. ఏ సెంటర్లో ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో జనం వెతుక్కోవాల్సి వస్తోంది. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారందికీ వాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు హైరిస్క్‌లో ఉన్న వాళ్ళకు మాత్రమే వాక్సిన్ వేయగా అర్హులందరికీ టీకా ఇస్తున్నారు.. ప్రభుత్వ సెంటర్లతో పాటు…
శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతూనే ఉంది.. ఇన్‌ఫ్లో రూపంలో 4,60,154 క్యూసెక్కుల నీరు వచ్చి జలాశయంలో చేరుతుండగా… 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. మొత్తంగా 3.40 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్ నుంచి దిగువకు వెళ్తోంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం డ్యామ్‌లో 212.4385…