కేసీఆర్‌పై మాజీ ఎంపీ ఫైర్.. డేంజరస్ ఫెలో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ రవీందర్ నాయక్.. దళిత బంధు పథకాన్ని స్వాగతించిన ఆయన.. వంద ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్లు ఉంది కేసీఆర్ వైఖరి అంటూ ఎద్దేవా చేశారు. దళిత గిరిజనులను… తెలంగాణ పేదలను మోసం చేసి హుజురాబాద్ లో గెలిచేందుకు ఈ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ ఓ చీటర్.. ఏడేళ్లుగా అందరినీ మోసం చేస్తున్నారని విమర్శించారు.. తెలంగాణ మేధావులు. రాజకీయ నాయకులు దీనిపై ఆలోచించాలని సూచించిన ఆయన.. ఇక, హుజురాబాద్ లో దళిత బంధు తీసుకోవాలి.. ఆ తరువాత ఆయనకు బుద్ధి చెప్పాలి.. అప్పుడే రాష్ట్రంలో మిగిలిన దళితులకు.. గిరిజనులు.. పేదలకు న్యాయం చేస్తారని సూచించారు.
ఏడున్నర ఏళ్లుగా దళిత.. గిరిజనులకు కేటాయించిన డబ్బులే ఇప్పుడు ఇస్తున్నారని విమర్శించారు రవీంద్రనాయక్.. 20 లక్షల కోట్ల బడ్జెట్ లో 60వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఉంటాడు అని కామెంట్ చేసిన ఆయన.. కేసీఆర్ సీఎం అయ్యాక పేదలకు చేసిందేమీ లేదు.. కానీ, తన కుటుంబానికి మాత్రం ఫాం హౌజ్ లు.. భూములు కొన్నారు.. పదవులు ఇచ్చుకున్నారని.. అధికారం నిలబెట్టుకునేందుకు మాత్రమే కేసీఆర్ పని చేస్తారని ఎద్దేవా చేశారు. తనకొడుకును ముఖ్యమంత్రి చేయడం.. చివరకు మనువన్ని కూడా కేసీఆర్ గెలిపించుకుంటారని కామెంట్ చేసిన ఆయన.. ధనదాహం తీర్చుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టారని మండిపడ్డారు.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు దారి మళ్లించారని ఆరోపించిన బీజేపీ నేత.. తాండాలను పంచాయతీలు చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టారని.. అక్కడ బడ్జెట్ లేదు.. నిధులు ఇవ్వలేదు.. ఇక, జిల్లా పరిషత్ నిధులు35 వేల కోట్ల నిధులు కూడా విడుదల చేయలేదరని విమర్శించారు. ఏదీ చేయకుండా.. ఏదో చేసినట్లు నటిస్తాడు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రవీంద్రనాయక్.. పోడు భూముల రైతులను ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్ ను తన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
హుజూర్‌నగర్‌లో 40రోజుల పాటు గిరిజనుల ను జైలులో పెట్టించారని మండిపడ్డారు రవీంద్ర నాయక్.. ఎస్టీ కమిషన్ ను ఎందుకు సపరేట్ చేయలేదు? అని ప్రశ్నించిన ఆయన.. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఎందుకు చేయడం లేదు? అని నిలదీశారు.. 10 శాతం రిజర్వేషన్లు ఇస్తా అని తూతూమంత్రంగా బిల్లు పాస్ చేసారు.. దానికి రాజ్యాంగ సవరణ అవసరం అన్నారు. చేతివృత్తుల ఏ కార్పొరేషన్ లో నిధులు లేవు.. నిర్వీర్యం చేసారు.. ఉప ఎన్నికలు వస్తే గొర్రెలు, బర్రెల పంపిణీ అంటూ ప్రకటిస్తున్నారు.. కాపలా కుక్క లా ఉంటా అన్నాడు.. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. అభివృద్ధి చేసి ఉంటే హుజురాబాద్ లో ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నావు కేసీఆర్? అసలు కేసీఆర్ కు ఈటల రాజేందర్‌ను చూసి భయం పుట్టుకొచ్చిందని కామెంట్ చేశారు. ఈబీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.. కానీ, రాష్ట్రంలో అమలు చేయడం లేదన్న ఆయన.. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకిస్తున్నాడు అంటూ కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ డేంజరస్ ఫెలో.. ఆయనను రాజకీయంగా కొట్టి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!