తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృ వియోగం కలిగింది.. తమిళిసై తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. ఆమె వయస్సు 80 ఏళ్లుగా చెబుతున్నారు.. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు కృష్ణకుమారి.. కాసేపట్లో ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్ భార్య.. ఆ దంపతుల పెద్ద కుమార్తె గవర్నర్ తమిళిసై. కృష్ణకుమారి అంత్యక్రియలను ఇవాళ చెన్నైలో నిర్వహించే అవకాశం ఉంది.