ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం, చిరుజల్లులు పడుతుండగా.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు తప్పేలా లేవని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య బంగాళాఖాతం నుంచి నైరుతి దిశవైపునకు వంపు తిరిగి ఉన్నదని, వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయవ్యదిశగా కదలొచ్చని అంచనా వేస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నట్టు వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని పేర్కొంది.
వీటి ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం, గురువారం పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ కేంద్రం.. ఈ మేరకు తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేయగా.. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరిక జారీచేసింది. గురువారం పలు జిల్లాల్లో అతిభారీ, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చని హెచ్చరించింది. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు.
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
తాజావార్తలు
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్‌ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!