మహా నగరం హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ఉన్న నేపథ్యంలో… హైదరాబాద్ లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫలక్ నామా, ఇంజన్ బౌలి నుంచి వచ్చే వెహికల్స్ అలియాబాద్ నుంచి షంషీర్ గంజ్ గోశాల తార్బన్ మీదుగా వెళ్ళాల్సి ఉంటుందని.. అలాగే… కందికల్ గేట్ బాలరాజ్ గంజ్ మంచి లాల్ దర్వాజ రూట్ లో ట్రాఫిక్ ను అనుమతించబోమని పేర్కొన్నారు పోలీసులు.…
తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పాదయాత్ర నిర్వహిస్తోన్న బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేశారు.. ప్రజాదీవెన పేరుతో పాదయాత్రను ఈ నెల 19న కమలాపూర్ మండలం నుంచి ప్రారంభించిన ఆయన.. 12వ రోజు వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చేరుకుంది. ఇక, ఈటల సాయంత్రం 4 గంటలకు భోజనం చేశారు.. అప్పటికే స్వల్ప దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడ్డారు.. దీంతో వైద్య పరీక్షలు…
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లిలో ఉద్రిక్త నెలకొంది… అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్లను కూల్చివేశారు స్థానికులు.. నిన్న పోలీస్ బందోబస్తు మధ్య 33 కేవీ విద్యుత్ టవర్లను ఏర్పాటు చేశారు అధికారులు.. అయితే, ఇవాళ పెద్ద ఎత్తున తరలివచ్చిన తక్కళ్లపల్లి గ్రామస్తులు, మహిళలు… ఆ టవర్లను కూల్చివేశారు.. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. కాగా.. కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని అమెజాన్ సంస్థ కోసం విద్యుత్ టవర్లు ఏర్పాటు చేశారు.. తక్కళ్లపల్లి పవర్‌ప్లాంట్ నుంచి అమెజాన్…
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఈ మీటింగ్‌లోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల పలు దఫాలుగా దళితబంధుపై చర్చలు జరిపిన సర్కారు…ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత తొందరగా అమలులోకి తీసుకురావడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం తదితర అంశాలను ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.…
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు ఎక్కువగా.. హైదరాబాద్‌పై ఫోకస్ చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లను చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరం పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, అలాగే బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు… ప్రకటించారు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ అధికారులు. బోనాలు,…
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో క్రమంగా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,11,251 శాంపిల్స్ పరీక్షించగా.. 614 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో నలుగురు కోవిడ్ బాధితులు చనిపోయారు.. ఇదే మయంలో.. 657 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,330కి పెరగగా.. రికవరీ కేసులు 6,31,389కు చేరాయి.. ఇక, ఇప్పటి…
తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు, జాతీయ రహదారుల గుర్తింపు చేయాలని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి వినతి పత్రం అందించారు టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్య సభ ఎంపీల బృందం. అందులో… విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మించాలి. తెలంగాణలో నాలుగు జాతీయ రహదారులను గుర్తించాలని విన్నవించిన ఎంపీల బృందం… చౌటుప్పల్-షాద్ నగర్-కంది (RRR) – 186 KM…
ప్రజా దీవెన పాద యాత్రలో భాగంగా నేడు వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… మంత్రులకే దొరకని సీఎం ఎంపీటీసీ, సర్పంచ్ లతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మన దెబ్బ అలా ఉంది అన్నారు. ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యే లు నా మీదకు వస్తున్నారు. ఇది గడ్డి పోస కాదు, గడ్డపార. పొలిసులకు కూడ వారి మనసులో ఈటెల రాజేందర్ గెలువాలని ఉంది. నేను అందరికి సహాయం చేసే వాడిని.…
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా తీవ్రత, కరోనా థర్డ్ వేవ్ భయం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్ల కెపాసిటికి తగిన మొత్తంలో ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయని ఆసుపత్రులకు లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించింది. 200 వరకు బెడ్స్ అందుబాటులో ఉన్న ఆసుపత్రులు 500 ఎల్పీఎం కెపాసిటీ ఆక్సీజన్ జరరేషన్…