Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. జాతీయ జెండాను అవమానించాడంటూ ఆ స్టేషన్‌లో ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya national flag controversy: భారత్ టీ20 వరల్డ్ కప్పులో ఘన విజయం సాధించింది. మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఎంతో జోష్‌లో సంబరాలు జరుపుకుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై సంచలన ఆరోపణలు వచ్చాయి. జాతీయ పతాకాన్ని అవమానించాడని ఆరోపిస్తూ ఓ న్యాయవాది పూణే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూణే నగరంలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది వాజిద్ ఖాన్ ఈ ఫిర్యాదు సమర్పించారు. అహ్మదాబాద్ స్టేడియంలో హార్దిక్ పాండ్యా జాతీయ పతాకాన్ని తన మెడకు చుట్టుకుని అనుచితంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ జెండాను దెబ్బ తీసే విధంగా ప్రవర్తించాడని ఆరోపించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని వెల్లడించారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఫిర్యాదు అందిందని మాత్రమే అధికారులు నిర్ధారించారు.
READ MORE: Tollywood : ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్స్.. పవన్ & రణవీర్ ఆదుకుంటారా?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అసలు ఏం జరిగింది?
భారత్ టీ20 వరల్డ్ కప్పు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో భారత క్రికెట్ అభిమానులతో పాటు టీమిండియా ప్లేయర్లు సంబరాలు జరుపుకున్నారు. స్టేడియంలో కొంత మంది ప్లేయర్స్ జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సైతం త్రివర్ణ పతాకాన్ని మెడకు చుట్టుకుని సంబరాలు జరుపుకున్నాడు. అంతేకాదు.. ఇక్క హార్దిక్‌ను మాహిక శర్మ ముద్దు పెట్టుకుంది. అతన్ని ఆలింగనం చేసుకొని, ముద్దు పెట్టి అభినందించింది. వీరిద్దరూ కొంత అనుచితంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల నేపథ్యంలో న్యాయవాది వాజిద్ ఖాన్ ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఏం జరుగుతుందో వేచి చూద్దాం..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!