తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 621 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కగా.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 691 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,951 కు చేరగా… రికవరీ కేసులు 6,32,080 కు…
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఇంచార్జ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు 31.30కోట్ల రూపాయలతో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంధర్బంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ… దేశంలో రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన మొఖమా బీజేపీ నాయకులది. రెండు వేలు ఇవ్వలేని వాళ్ళు రూ.50లక్షలు కావాలని డిమాండ్ చేయడం సిగ్గు చేటు. జీహెచ్ఎమ్ సి ఎన్నికల్లో బండి సంజయ్ ఏం మాట్లాడిండు.…
కరోనా మహమ్మారి కారణంగా కోర్టులు కూడా ఆన్లైన్ విచారణకే పరిమితం అయ్యాయి… కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష విచారణకు సిద్ధం అవుతోంది తెలంగాణ హైకోర్టు.. ఆగస్టు 9వ తేదీ నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది.. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ జరగనుండగా.. రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ జరుపుతుందని.. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష…
వరంగల్ లో ఎంపీటీసీల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గడీల కుమార్ మాట్లాడుతూ… మా సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. గత మార్చి 22న కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. గత బడ్జెట్లో మాకు 500 కోట్ల నిధులు కేటాయించారు, కరోనా కారణంగా విడుదల నిధులు విడుదల కాలేదు. కొందరు సభ్యులు స్వలాభం కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీటీసీల ఫోరం…
రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.. ప్రస్తుతం కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన ఆయన.. సేకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదని.. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కేసులు అధికంగానే ఉన్నాయని తెలిపారు.. డెల్టా వేరియంట్ భారత్ సహా 135 దేశాల్లో తీవ్రంగా ఉందన్న ఆయన.. నిన్న దేశంలోని 50 శాతం కేసులు ఒక కేరళలోనే వెలుగుచూశాయన్నారు.. డెల్టా వైరస్ శరీరం పై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు…
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు అద్వాన్నంగా తయారు అయ్యాయని.. చిన్న వర్షానికే వాటర్ జమ అవుతుంది… అందులో పడి చనిపోతున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం ఉత్తుత్తి స్కీమ్ లు పెడుతున్నారని.. అక్కడ టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదని చురకలు అంటించారు. అయ్యా, కొడుకులు ఒకసారి బైక్ మీద తిరిగితే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని ఫైర్ అయ్యారు.. గ్రేటర్ కమిషనర్ ని అడిగితే…
రేపు హైదరాబాద్‌లో లాల్‌దర్వాజా బోనాలు జరగనున్నాయి.. ఇదే రోజు హైదరాబాద్ మొత్తం… శివారు ప్రాంతాలు.. మరికొన్ని గ్రామాల్లో కూడా బోనాలు తీయనున్నారు.. దీంతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు.. సిటీలో జరిగే బోనాల ఉత్సవాలకు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు సీపీ అంజనీకుమార్.. బోనాలు, అంబారీ ఊరేగింపు సందర్భంగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించిన ఆయన.. కమిషనర్ నుంచి హోంగార్డు వరకూ అందరూ బందోబస్తు విధుల్లో పాల్గొంటారని.. పాతబస్తీలోని పలు కాలనీల నుంచి బోనాల ఊరేగింపు లాల్…
దళిత బంధుతో దళితులను దగా చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గీతారెడ్డి.. కేసీఆర్ దళితుల గురించి ఎన్నో చెప్పారు.. దళితులని సీఎం చేస్తా అన్నారు.. లేదంటే తల నరుక్కుంటా అన్నారన్న ఆమె.. డిప్యూటీ సీఎం రాజ్యను ఎందుకు కేబినెట్ నుంచి తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.. సబ్ ప్లాన్ ఫండ్స్ కోసం ఏడేళ్లుగా రూ.85,913 కోట్లు కేటాయించారు.. కానీ, ఏడేళ్లలో ఖర్చు చేసింది మాత్రం రూ.47,685 కోట్లు మాత్రమే.. మిగతా…
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భావజాలం వ్యాప్తి కోసం, బీజేపీ జెండా ఎగరేయడానికి, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు.. వారి బలిదానాలను వృతా కానివ్వం అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… వేలాది మంది నక్సలైట్ల చేతిలో తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.. ఆ మహనీయుల బలిదానాలు వృథా కానివ్వం.. వారి స్ఫూర్తితో జాతీయవాద భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారాయన.. హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా…
ఎంకిపెళ్లి సుబ్బిచావుకు రావడం అంటే ఇదే. ఏదో ఆశించి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే.. అది అధికారపార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేసిందట. ‘రాజీనామా చేయండి సార్..!’ అంటూ.. సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్‌తో శాసనసభ్యులకు తలబొప్పి కడుతోందట. అదేంటో లెట్స్ వాచ్! హుజురాబాద్‌లో దళితబంధు పైలెట్ ప్రాజెక్టు దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ స్కీమ్‌పై వివిధ వర్గాలతో సమాలోచనలు చేశారు సీఎం కేసీఆర్. పథకాన్ని పట్టాలెక్కించే పనిలో…