తెలంగాణ సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’పై ప్రత్యేకంగా ఫోకప్ పెట్టారు.. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలతో సమావేశం కూడా నిర్వహించారు సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి.. హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. రాజకీయంగా లబ్ధిపొందడానికే ఈ పథకం తెచ్చారని ఆరోపిస్తున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారం…
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనది గుర్తుచేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడులో నివాళులర్పించారు రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సురేష్ షెట్కార్, తదితరులు.. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందని.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం…
కబ్జా కోరులు రెచ్చిపోతున్నారు.. కోట్లాది విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు… షేక్‌పేట్ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేటుగాళ్లు ఏకంగా.. 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేశారు.. ఏసీబీ ప్రధాన కార్యాలయం ముందు ఉన్న 9 ఎకరాల స్థలంపై కన్నువేసిన కబ్జా కోరులు.. అందుకోసం షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు.. ఈ వ్యవహాన్ని పసిగట్టిన తహసీల్దార్.. రామ చంద్రరావు అనే వ్యక్తిపై బంజారాహిల్స్…
శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది.. 4,66,864 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో వచ్చి డ్యామ్‌లో చేరుతుండగా… కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఔట్ ఫ్లో 62 వేల క్యూసెక్కులుగా ఉంది.. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 879.30 అడుగులకు చేరింది… పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 184.27 టీఎంసీల నీరు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, ఇంకా భారీగానే…
మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం నాయకులు ఎక్కువైతే.. పదవులు పెరుగుతాయి. ఉన్నవాళ్లకు పని లేకపోయినా.. పదవుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లడం ఆ పార్టీ స్పెషల్. ఇప్పుడు ఓ పదవికి ఇంకా డిమాండ్ పెరిగింది. అలకపాన్పు ఎక్కిన నేతలు సైతం ఆ పోస్టే అడుగుతున్నారట. ఇంతకీ ఆ పదవికి ఉన్న క్రేజ్ ఏంటి? అలకలో ఉన్న కాంగ్రెస్ నేతలు… ఆ పదవే కోరుతున్నారా? తెలంగాణకు కొత్త పీసీసీని ప్రకటించినప్పుడు మొదలైన నేతల అలకలు…
కేసీఆర్ కుటుంబంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రమంతా అప్పుల పాలు అయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని షర్మిల విమర్శించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా ఏకంగా 4 రెట్లు నిరుద్యోగం పెరిగిందని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. దళితులకు రూ.10 లక్షలు కాదు, రూ.50 లక్షలు ఇవ్వాలని…
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,23,166 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 645 మందికి పాజిటివ్‌గా తెలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 6,42,436 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 6,29,408 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,237 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 4 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు మృతి…
రాజన్న బిడ్డగా మా నియోజకవర్గంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. షర్మిల దీక్షకు సంఘీభావం తెలియజేస్తున్నా అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. వారికి నా పూర్తి మద్దతు ఉంటుంది. కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేశారు. ఉద్యోగాలను వదిలేసి కుటుంబం కోసం ఆలోచిస్తుండు. వైఎస్సార్ గారు మాకు ప్రాణం. బతికున్నంత వరకూ వైఎస్సార్ మా గుండెల్లో ఉంటారు. మునుగోడు ప్రజలకు వైఎస్సార్ ఉదయ సముద్రం ప్రాజెక్టు కట్టించారు. ఆ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు…