వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.. ఆయన వీఆర్ఎస్ తీసుకన్న తర్వాత.. టీఆర్ఎస్లో చేరతారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం తెరపైకి రాగానే వాటిని ఖండించారు.. ఇక, ఆ తర్వాత ఆర్ఎస్పీ.. బీఎస్పీవైపు అడుగులు వేస్తున్నారని.. ఆ పార్టీలో చేరి.. తెలంగాణలో బీఎస్పీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టనున్నారనే చర్చసాగింది.. ఆ వార్తలను నిజమేనని తేలిపోయింది.. తాజాగా మీడియాతోమాట్లాడిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. కాన్షీరాం అడుగుజాడల్లో…
తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో పేరు పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు.. ఇక, నిరుద్యోగ సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఆమె.. నిరుద్యోగ దీక్షల పేరుతో వరుసగా దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ఇకపై.. ప్రతీ మంగళవారం దీక్షలు చేయనున్నట్టు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటించింది.. ఇక, ఇవాళ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ…
హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే గులాబీ బాస్ సీఎం కేసీఆర్.. సంక్షేమ పథకాలు దృష్టిసారించగా… అటు మంత్రి కేటీఆర్… పార్టీ భవిష్యత్తు కార్యచరణపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యలోనే టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు బీమా…
మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. సిద్ధిపేట ఔటర్ బైపాస్ పైన, మెడికల్ కాలేజీ దగ్గరలో నిన్న రాత్రి బైక్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తూ డివైడర్ కు ఢీ కొట్టి, తీవ్రంగా గాయపడ్డారు సిద్ధిపేటకు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు. అయితే.. అదే సమయంలో సిరిసిల్ల పర్యటన ముగించుకున్న కేటీఆర్.. అదే మార్గంలో వచ్చారు. read also : మహిళలకు షాక్… మళ్లీ పెరిగిన బంగారం ధరలు ఈ నేపథ్యంలో…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు పోటాపోటీగా లేఖలు రాస్తున్నాయి. అయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది… రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పై నిర్మించిన, నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని లేఖలో పేర్కొంది కేఆర్ఎంబీ… కాగా, ఇప్పటి వరకు ఒక రాష్ట్రం పై మరో రాష్ట్రం ఆరోపణలు చేస్తూ రాగ……
భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం తీసుకున్నారు.. బీజేపీకి బైబై చెప్పిన తర్వాత.. ఆయన ఏ పార్టీలో చేరతారు? అనే చర్చ సాగుతోన్న నేపథ్యంలో… తాను టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు.. బీజేపీలో పరిస్థితిలు నాకు నచ్చలేదన్న పెద్దిరెడ్డి… కానీ, ఆ పరిణామాలపై విమర్శలు చేయదల్చుకోలేదన్నారు.. అయితే, ఈటల రాజేందర్.. బీజేపీలో చేరిన విషయంలో నాకు గౌరవం ఇవ్వలేదని కామెంట్ చేశారు.. ఇక,…
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో క్రమంగా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,14,105 శాంపిల్స్ పరీక్షించగా.. 638 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు చనిపోయారు.. ఇదే మయంలో.. 715 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,41,791కి పెరగగా.. రికవరీ కేసులు 6,28,679కు చేరాయి.. ఇక, ఇప్పటి…
దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ”ముఖ్యమంత్రిగారు దళిత బంధు పథకం నిజాయితీతో ప్రకటించినట్లయితే ఎంతైనా అభినందనీయం… అయితే, గతంలో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు లాంటి అనేక హామీలు తుంగలోకి తొక్కడం… దళిత ఉపముఖ్యమంత్రులను అవమానకరంగా ఊడపీకడం వంటి దళిత వ్యతిరేక చర్యల దృష్ట్యా కేసీఆర్ గారిని…
రైల్వే ప్రయాణికులతో పాటు స్టేషన్‌కు వెళ్లేవారికి.. రైళ్లలో వచ్చేవారిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కు వెళ్లేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. తాత్కాలికంగా పెంచిన ప్లాట్‌ఫారమ్ టికెట్ ధరను సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.. కరోనా మహమ్మారి కారణంగా గతంలో నిలిపేసిన ప్లాట్‌ఫారమ్ టికెట్ల జారీ మళ్లీ పునరుద్ధరించారు అధికారులు… జోన్ నెట్‌వర్క్‌లో అన్రిజర్వ్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పునరుద్ధరించిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో…