ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు… ఈ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసింది… రేవంత్‌రెడ్డితో పాటు.. అప్పటి టీడీపీ.. ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా సమన్లు జారీ అయ్యాయి.. ఈడీ కేసులను విచారించే నాంపల్లి ఎంఎస్ జే కోర్టు నుంచి ఈ సమన్లు జారీ అయ్యాయి… అక్టోబరు 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. ఈ కేసులో.. సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, వేం కృష్ణ కీర్తన్ కు కూడా సమన్లు జారీ అయ్యాయి. కాగా, ఓటుకు నోటు కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.. కేసులు, అరెస్ట్‌ల పర్వం కూడా కొనసాగింది.. ఇప్పుడు.. ఈడీ చార్జీషీట్‌తో మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది.