రైతులకు గుడ్న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… ఇప్పటికే రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ మొత్తం ఈ నెల 16వ తేదీ నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమకానుంది… రాష్ట్రంలోని ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేయనున్నారు… బ్యాంకర్లు రుణ మాఫీ…
తెలంగాణ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పెను ప్రమాదమే తప్పింది… మంత్రి ఎర్రబెల్లి ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది… ట్రాక్టర్ దమ్ము చక్రాలు ఎర్రబెల్లి వాహనానికి తగిలాయి.. దీంతో.. ఎర్రబెల్లి వాహనం పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది… మహబూబాబాద్ జిల్లా వెలిశాల-కొడకండ్ల మధ్య ఈ ఘటన జరిగింది.. ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
గులాబీ తెలంగాణ.. నీలి తెలంగాణ కావాలని ఆకాంక్షించారు మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్… ఇంకా సర్వీస్ ఉన్నా.. తన ఆఫీసర్గా ఉంటే.. ప్రజలకు నేను అనుకున్నస్థాయిలో చేరువ కాలేకపోతున్నా.. తాను అనుకున్నవిధంగా వారికి సేవ చేయలేకపోతున్నానని భావించి వీఆర్ఎస్ తీసుకున్న ఆయన.. తర్వాత బీఎస్పీలో చేరనున్నట్టు ప్రకటించారు.. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించారు. ఇక, త్వరలోనే బీఎస్పీలో చేరనున్నారు. దీనికి ముహూర్తం కూడా ఇప్పటికే ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్..…
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వివిధ శాఖల్లోని పోస్టులు.. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేటగిరిల వారీగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం క్యాడర్ విభజన చేసింది.. ఏ పోస్ట్ ఏ కేటగిరి కిందకు వస్తుందో క్యాడర్ ని విభజిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. మిగతా పోస్టులు జోనల్, మల్టీ జోనల్ పోస్టులు పేర్కొంటూ.. 84 జీవోను జారీ చేసింది ప్రభుత్వం.. కొన్ని లోకల్ క్యాడర్ పోస్టులు, జోనల్ పోస్ట్…
దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. మొదట హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అమలు చేయాలని భావించారు.. కానీ, తాను దత్తతకు తీసుకున్న వాసాలమర్రి నుంచే ఆ పథకం అమలుకు పూనుకున్నారు.. ఇప్పటికే ఆ గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ.10 చొప్పున ఫండ్స్ రిలీజ్ చేసింది ప్రభుత్వం.. మరోవైపు.. దళిత బంధుపై విమర్శలు వస్తున్నాయి.. ఆ విమర్శలపై స్పందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దళిత బంధు పథకాన్ని బీజేపీ పార్టీ అడ్డుకునే ప్రయత్నం…
కొడుకు, కోడలి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజు పోలీసులను ఆశ్రయించారు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నం 4లో నివాసముంటున్నారు మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణ రాజు… ఆయన వయస్సు 75 ఏళ్లు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారాయన.. ఆయన భార్య జానకి గతేడాది మార్చిలో అనారోగ్య సమస్యలతో మృతిచెందారు.. అయితే, కొడుకు కేవీఎస్ రాజు, కోడలు కంతేటి పార్వతి నుంచి తనకు ప్రాణహాని ఉందంటున్నారు మాజీ…
పోలీసు శాఖలో మళ్లీ కరోనా మహమ్మారి కేసులు కలకలం సృష్టిస్తున్నాయి… రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా పలువురు పోలీసు సిబ్బందికి కరోనా సోకుతుంది… హైదరాబాద్లో పదుల సంఖ్యలో పోలీసులు కరోనాబారినపడ్డారు… వరుస ఉత్సవాలు, బందోబస్తులు , నిరసనలు, ఆందోళనలతో పోలీసు శాఖను కరోనా మహమ్మారి వణికిస్తోంది… ఇప్పటికే పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ వేశారు.. అయితే, ఆందోళనలు ముట్టడి కార్యక్రమాలు ఉంటుండడంతో పోలీసులకు కరోనా టెన్షన్ వెంటాడుతోంది… గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో…
తెలంగాణకు గత మూడేళ్లలో 7 కొత్త జాతీయ రహదారులు ప్రకటించినట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణకు గత మూడేళ్ల కాలంలో కొత్తగా మంజూరైన జాతీయ రహదారుల వివరాలతోపాటు రహదారుల నిర్మాణంలో భూ సేకరణ సమస్య ఏర్పడితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటనే అంశంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇవాళ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు నితిన్ గడ్కరీ. 2020 జూన్ 29న 90 కిలోమీటర్ల మేరకు…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్… ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.. ఇవాళ ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులతో కలిసి ప్రధాని చెంతకు వెళ్లారు బండి సంజయ్.. జాతీయస్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది.. మరోసారి 600కు దిగువగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 582 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక, ఒకేరోజు 638 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్… దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల…