తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది.. మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఆయన బామ్మర్ది మద్దుల శ్రీనివాస్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు.. ఆయనపై కూడా కబ్జా ఆరోపణలు చేశారు.. ఇక, రేవంత్ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు శ్రీనివాస్‌రెడ్డి.. ఆయన ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు.. నన్ను ఉప సర్పంచ్ అని అన్నావ్… కానీ, నేను సర్పంచ్ గా పనిచేసాను అని తెలుసుకోవాలని సూచించారు.. మల్లారెడ్డికి అప్పటి పాలకవర్గం అన్ని అనుమతులు ఇచ్చిందన్న ఆయన.. సరైనా సమాచారం తీసుకొని ఆరోపణలు చేయాలని సూచించారు.. తప్పుడు ఆరోపణలు చేస్తే బాగుండదు ఖభర్దార్ అంటూ హెచ్చరించారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని రేవంత్‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు శ్రీనివాస్‌రెడ్డి.. యూనివర్శిటీకి అక్రమంగా భూములు కట్టబెట్టారని అనడం తప్పు అని కొట్టిపారేసిన ఆయన..అది ప్రభుత్వ భూమి కాదు.. పట్టా భూమి అని క్లారిటీ ఇచ్చారు. నా దగ్గర అన్ని భూముల డాక్యుమెంట్లు ఉన్నాయని.. 100 శాతం అనుమతులు ఉన్నాయని.. ఆ భూములను 1989లో కొంటే 2017లో అనుమతులు వచ్చాయని వెల్లడించారు.. భూకభ్జా కేసులు ఉంటే కోర్టు ద్వారా తెసుకోవాలని సూచించారు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి.