రాజీలేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం.. ఒక్క రూపాయి అవసరంలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడ రాజీపడకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తున్నాం.. చక్కగా కాపాడుకోవాలి.. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్.. మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంగంమెట్, బండ్లగూడ, ఫారూఖ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసి పేద ప్రజలకు అందజేస్తామన్నారు. పిల్లిగుడిసెల బస్తీలో ఒకప్పుడు మంచినీళ్ల గోస ఉండేది. డ్రైనేజీ సరిగా లేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు అని తెలిపారు.. ఈ ఇళ్లను ప్రైవేట్ బిల్డర్ కట్టి ఉంటే.. ఒక్కో ఇల్లు రూ. 50 నుంచి రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసి ఉండేదన్న కేటీఆర్.. కానీ, సీఎం కేసీఆర్ నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తున్నారని.. నాణ్యత విషయంలో రాజీ పడకుండా.. పనులు చేస్తున్నాం. ఇది ఇల్లు కాదు.. పేద వాడి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు.
మరోవైపు.. చంచల్‌గూడ జైలును ఇక్కడి నుంచి తరలించాలని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఓవైసీ విజ్ఞప్తిపై స్పందించిన కేటీఆర్.. 34 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చంచల్‌గూడ జైలును తరలించి.. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇళ్లను కానీ, ఐటీ పార్కు కానీ, విద్యాసంస్థలు కానీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఇక, ప్రగతి భవన్ లో ఉన్న లిఫ్ట్… ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ లో ఉన్న లిఫ్ట్ కంపెనీ ఒక్కటే నన్న కేటీఆర్.. గ్రేటర్ లో ఇది 25వ డబుల్ బెడ్ రూమ్ సైట్.. హైదరాబాద్ లో లక్ష బెడ్ రూమ్ లు పేద ప్రజలకు సర్కార్ ఇస్తుందన్నారు. చక్కగా కాపాడుకోండి… పరిశుభ్రంగా ఉంచుకోండి.. లాటరీలో వచ్చే వారికి డబుల్ బెడ్ రూమ్ లు కేటాయిస్తారు… ఏ, ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్.
Also Read
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?