తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయ్యారు. మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ ను అర్థరాత్రి అరెస్ట్ చేశారు చిలకలగూడ పోలీసులు. తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. 30 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసాడని, ఇవ్వక పోయేసరికి తనను బ్లాక్ మెయిల్ చేశాడంటూ ఫిర్యాదు చేశాడు జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ. ఈ మేరకు ఇప్పటికే తీన్మార్ మల్లన్న ను నోటీసులు ఇచ్చి విచారణ చేసిన పోలీసులు…. తాజాగా నిన్న అర్థరాత్రి అరెస్ట్ చేశారు. దీంతో తీన్మార్ మల్లన్న నిర్వహిస్తున్న క్యూ న్యూస్ ఛానల్ దగ్గర అర్థరాత్రి పెద్ద హై డ్రామా చోటు చేసుకుంది. అటు తీన్మార్ మల్లన్న అరెస్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆయన అనుచరులు.