గణేశ్ ఉత్సవాల నిర్వాహణపై తెలంగాణ హై కోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం పై ఆంక్షలు హైకోర్టు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తమ ఆంక్షలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. ప్రత్యేక కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని… హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రబ్బరు డ్యాంలోనే నిమజ్జనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని పేర్కొంది.