ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అధికంగా కనిపించేవారు. ఇప్పుడు సీనియర్లతో పాటుగా దూకుడు కలిగిన యువనేతలు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నారు. సీనియర్లు యువ నేతలతో కాంగ్రెస్ పార్టీ నిండుదనంగా కనిపిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేసిన తరువాత కాస్తంత దూకుడును ప్రదర్శిస్తోంది. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి మొదట్లో వర్కింగ్ ప్రెసిడెండ్‌గా బాధ్యతలు అప్పగించగా, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో, రేవంత్‌కు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన తరువాత ఆ పార్టీ మరింత దూకుడు పెంచింది. ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ పోరాగం చేయడం మొదలు పెట్టింది. గిరిజన దళిత దండోరా సభలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటైన విమర్శలు చేయడం మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేస్తుండటంతో పాటుగా, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓట్ బ్యాంక్ పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. 2023లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. టీఆర్ఎస్ ను ఓడిండమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దూకుడును ప్రదర్శిస్తోంది. నిన్నటి రోజున రేవంత్ రెడ్డి తన కొత్త టీమ్‌తో వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.
Read: తాలిబన్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఆఫ్ఘన్ మహిళలు…