టీఆర్‌ఎస్ నేతలు మరియు కార్యకర్తలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ దిశా నిర్ధేశం చేసారు .ఇటు త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ ఉంటుందని ప్రకటించారు కేటిఆర్ .గ్రేటర్ ఎన్నికల సమయంలో కో అపన్ష్ మెంబర్స్ గా అవకాశం ఇస్తామని హమీ ఇచ్చామని …అది కూడా జరిగేలా చూస్తామన్నారు.టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ కొనసాగుతూ వస్తోంది .కొంత మందికి కార్పోరేషన్ చైర్మన్ల పదవి కాలం పొడిగించగా… మరి కొంత మందిని కొత్తగా నియమించారు. ఎప్పటికప్పుడు ఆశవాహులు నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆశలు పెట్టుకుంటూ వస్తున్నారు .అయితే తాజా సమావేశంలో కేటీఆర్ దీనిపై ప్రకటన చేయడంతో ఆసక్తి నెలకొంది. వివిద కార్పోరేషన్లలో ఉన్న డైరెక్టర్ పోస్టుల భర్తీ ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఓవైపు కార్పోరేషన్లలో నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తూ …ఇంకా అవకాశం రానివారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.