రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైల్వే శాఖ సహాయ మంత్రి రావూ సాహేబ్ పాటిల్ ధన్వే మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాల ఆదేషాలతో ఇక్కడికి వచ్చాను అని చెప్పిన ఆయన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తుంది. ఆయన మొదటి దశ యాత్ర అక్టోబర్ 2న ముగుస్తది. గ్రామాలకు తరలి వెల్లండి అని చెప్పిన గాంధి జయంతి రోజున ముగుస్తుంది. ఏ ఇతర పార్టీల నేతలు గ్రామాలకు వెల్లడం లేదు.. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవెరడం లేదు అన్నారు. దళితులకు మూడెకరాలు, డబల్ బెడ్ రూమ్, దలిత ముఖ్యమంత్రి నియామకం, ఒక లక్ష ఉద్యోగాలు, కేజీ టూ పీజి ఉచిత విద్య అమలు కావడం లేదు. అందుకే ప్రజల్లో అసంతృప్తి వుంది అని తెలిపారు.
ఇక తమ గోడు వినే వారు లేరు అని భావించిన తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పాద యాత్ర చేస్థున్నారు. కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని రాష్ట్రం ఆరోపిస్తుంది. ఇచ్చిన వాటి లెక్కలు చెప్పాలి కదా కరోనా మహమ్మారిని ప్రధాన మంత్రి నాయకత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రపంచంలో రెండవ అతి పెధ్ధ రాజ్యం, అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది. బియ్యం పై 37 రూపాయలు, గోధుమలపై 22 రూపాయలు కేంద్రం భరిస్తుంది అని పేర్కొన్నారు.