కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపి లో కిపోవడం తో నే నల్ల చట్టలు తెల్ల చట్టాలు అయ్యాయ. ఈటల రాజేందర్ కు దమ్ముంటే పెంచిన ధరలు తగ్గించి ఓట్లు అడుగాలే. కుల సంఘాలకు భావనలు ఇస్తే మంత్రి హరీష్ రావు కు పిలిచి సన్మానం చేస్తున్నారు. సీఎం సిటుకు గురి పెట్టకపోతే ప్రతిపక్ష నేతలు ఈటల సిఎం కావాలని కోరితే ఎందుకు ఖండించలేదు అని అడిగారు. కబుర్లు చెప్పేది ఈటల రాజేందర్ గారు పనులు చేసేది కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ లో మంత్రి గా అభివృద్ది చేయకుండా అభివృద్ది చేసే వాళ్ళను ఎందుకు విమర్శిస్తున్నవు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చే దమ్ము బిజెపి నాయకులకు ఉందా అని అన్న ఆయన మేక పోతుకు బలిచ్చే ముందు దండ వేసినట్టు ఈటల రాజేందర్ కు అమిత్ షా దండ వేసిండు అని తెలిపారు.
హుజూరాబాద్ నియోజక వర్గం లో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు చందాలు వేసుకుని గెల్లు శ్రీనివాస్ కు ఫ్లెక్సీ లు కడుతున్నం. హుజూరాబాద్ లో ఉన్న ప్రజలు ఈటల రాజేందర్ పై తిరగబడే రోజు వస్తుంది. సీఎం కేసీఅర్ మా దేవుడే గేల్లు శ్రీనివాస్ ను రాబోయే ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు లక్ష మెజారిటీతో గెలిపించబోతున్నారు అని పేర్కొన్నారు.