జేసీపై జీవన్‌రెడ్డి సీరియస్.. తప్పైపోయిందన్న జేసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో హల్ చల్ చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను కూడా ఆయన కలిసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇదే సమయంలో.. సీఎల్పీ కార్యాలయానికి సైతం వెళ్లిన ఆయన.. పాత మిత్రులను పలకరించారు.. అయితే, ఈ సమయంలో.. జేసీ దివాకర్‌రెడ్డిపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తమ సీఎల్పీకి వచ్చి పార్టీని డ్యామేజ్ చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి జేసీ దివాకర్‌రెడ్డి హితోక్తులు అవసరం లేదన్న ఆయన.. మంచి ఏదైనా ఉంటే చెప్పాలి.. కానీ, పార్టీ డ్యామేజ్ అయ్యేలా కామెంట్ చేయొద్దని జేసీకి సూచించారు. పార్టీకి మంచి చేయని మాటలు దయజేసి ఇక్కడ మాట్లాడొద్దు అంటూ రెండు చేతులు జోడించి జేసీని కోరారు జీవన్ రెడ్డి.. ఇక, దీనికి బదులిచ్చిన జేసీ.. ఇకపై మాట్లాడను.. నాకు దండం పెట్టొద్దు.. మాట్లాడను అంతే.. తప్పు అయిపోయిందన్నారు జేసీ.
కాగా, తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయానన్నారు జేసీ దివాకర్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి తెలంగాణకు వస్తానన్నారు. తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ప్రత్యక్షమైన జేసీ.. సీఎం కేసీఆర్ ను కలిసేందుకే తాను వచ్చానన్నారు.. మంత్రి కేటీఆర్ ను కలిసానని తెలిపారు. తర్వాత కాంగ్రెస్ శాససభ పక్ష కార్యాలయంలో పాత మిత్రులను కలిశారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి ఎందుకు ఓటమి పాలయ్యారో అందరికీ తెలుసునని చెప్పారు. జానారెడ్డి ఓడిపోతానని తాను ముందే చెప్పానన్న ఆయన.. ప్రస్తుతం రాజకీయాలు, సమాజాలు బాగాలేవన్నారు.. ఇక, హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి తనకు తెలియదన్నారు జేసీ.
Also Read
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
తాజావార్తలు
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!