రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… రైతుబంధు సొమ్మును రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తెలంగాణ సర్కార్.. రేపటి నుంచి యాసంగి రైతుబంధు నిధులు పంపిణీ జరగనుంది.. ఈ పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు విడతలలో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాలలోకి జమ అయ్యాయి.. ఈ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమ కానున్నాయి.. ఇక, డిసెంబర్ 10వ తేదీ నాటికి ధరణి పోర్టల్ నందు పట్టాదారులు, కమీషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్ఓఎఫ్ ఆర్ పట్టాదారులు.. ఈ సారి రైతు బంధుకు అర్హులు కానున్నారు.. ఈ సీజన్‌లో 66.61 లక్షల మంది రైతులుకు గాను 152.91 లక్షల ఎకరాలకు రూ.7645.66 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం.. కాగా, దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా రైతులకు పెట్టుబడి సాయంగా సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని తీసుకురాగా.. తర్వాత కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కూడా ఈ తరహా పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.